Suryaa.co.in

Telangana

బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు మాలిన పని

– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

బీజేపీ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు మాలిన పని అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో సమావేశాలకు హాజరైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమంటే , తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ అంటే ఎంతగా భయపడుతుందో అర్థం అవుతుంది అని డీకే అరుణ పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.

ప్రశ్నించే వారంటే కెసిఆర్ కు గిట్టదని, కెసిఆర్ రాజ్యాంగం మార్చి తన ఇష్టా రాజ్యాంగం రాసుకోవడానికి ఇట్టువంటి దుశ్చర్యలకు పాలు పడుతున్నాడని డీకే అరుణ ధ్వజ మెత్తారు. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించడమే కాకుండా, వాల తోక పార్టీల తోత్తులతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదు అని చెప్పించడం దురదృష్టకరమని డీకే అరుణ దుయ్యబట్టారు.

బడ్జెట్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే లు వేసే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతోనే , ముందస్తుగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తే, బీజేపీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భయం ఎందుకు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పై తెలంగాణ ప్రభుత్వం బురద చల్లి, ప్రజలకు అబద్ధాలు చెప్తే, వాటిని బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తారని , ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు కెసిఆర్ ప్రభుత్వం పాలు పడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు.

LEAVE A RESPONSE