Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పీఎస్ గా పనిచేశారు.. ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడంపై వారంలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మొమో జారీ చేసింది. అయితే శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాధానం లేనందున, ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించారని పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపి స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో నిధుల మళ్ళింపు శ్రీనివాస్ చేతులమిదుగానే జరిగిందని సీఐడీ, ఆరోపిస్తోంది… అంతేకాక చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంలో కూడా. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెండ్యాల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సహకారం తీసుకొంటామని సీఐడీ పేర్కొంది

LEAVE A RESPONSE