Suryaa.co.in

Telangana

వ‌స‌తి గృహ వార్డెన్ పై స‌స్పెన్ష‌న్ వేటు

– మలక్ పేట లైంగిక దాడి ఘటనపై ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తు
– మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆగ్ర‌హం

హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వ‌స‌తి గృహ వార్డెన్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని అధికారుల‌కు మంత్రి ఆదేశాలు జారి చేసారు.

లైంగిక దాడి ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే, సంబంధిత అధికారుల నుంచి మంత్రి నివేదిక‌ కోరారు. ఘ‌ట‌న‌పై వెంట‌నే ఉన్న‌త స్థాయి క‌మిటీని నియ‌మించి స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న, విధుల ప‌ట్ల అల‌స‌త్వం వ‌హించిన సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారి చేసారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలికి సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేందుకు శాఖ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశించారు.

LEAVE A RESPONSE