-ఎంపీ గోరంట్ల మాధవ్ చే జెండా వందనం చేయించడంతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేయించడం సిగ్గుచేటు
– మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
నీచమైన పనులకు పాల్పడిన ఎంపీ మాధవ్ తో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జెండా వందనం చేయించడంతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేయించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ కాదు ఒరిజనల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పిందన్నారు. అయినా చర్యలు శూన్యం.
రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తల దించుకునేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించాడు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ కాదు ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ వివరించినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందిండం లేదు? ఎంపీ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఇటువంటి ఆరోపణలు ఉన్న కేసు వచ్చినప్పుడు ఆ వీడియోని ప్రభుత్వ పరంగా ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి తప్పు అని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకోవచ్చు. అది పోలీసుల బాధ్యత. అది ఫేక్ విడియో అని పోలీసులు నిర్ధారించడమేంటి? హోం మంత్రి ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాం అని చెబుతున్నారు. హోం మంత్రికి రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసా? తెలియదా? పోలీసులు హోం మంత్రిని పక్కన పెట్టి వారే ఎలా మాట్లాడుతారు?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.
అసభ్యకరంగా మాట్లాడే గోరంట్ల మాధవ్, అరగంట గంట రమ్మనే అవంతి శ్రీనివాస్, అంబంటి రాబాంబు, అసభ్యంగా ప్రవర్తించే ఇతర నాయకులపై చర్యలు తీసుకోకపోగా వారికి క్యాబినెట్ మంత్రులను చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ను కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని జగన్ రెడ్డి కోరినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించే ఇటువంటి వ్యక్తులను చట్టరీత్యా శిక్షించి, మహిళలను రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. గోరంట్ల మాధవ్ గలీజు వ్యవహారం పై మహిళా కమీషన్ ఏం చేస్తోంది? మహిళా కమీషన్ కు ఇటువంటివి పట్టవా? నేషనల్ ఉమెన్ మహిళా కమీషన్ స్పందించే వరకు రాష్ట్ర మహిళా కమీషన్ కళ్లు మూసుకొని వుంది. నేషనల్ ఉమెన్ మహిళా కమీషన్ స్పందించి పార్లమెంటు, స్పీకర్, రాష్ట్ర డిజిపికి లేఖ రాసేవరకు రాష్ట్ర మహిళా కమీషన్ కి ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి. అటువంటి మహిళా కమీషన్ ని ఇచ్చిన ఘనత జగన్ రెడ్డిది. సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?
మహిళలకు అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే స్పీడుగా వస్తానని అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి మహిళలకు హామీ ఇచ్చాడు. నేడు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు రాడు? దిశ చట్టం ఉందా లేదా? దిశ చట్టం ఉంటే వైసీపీ నాయకులు మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే దిశ చట్టం ఏమైంది? ఆఖరికిఎక్కడ ఉంది? ఉందా? లేదా? అని అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి ఇదే తీరుతో వ్యవహరిస్తూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పై చర్యలు తీసుకోకపోతే ప్రతి నియోజక వర్గానికి ఒక గోరంట్ల మాధవ్ పుట్టుకొస్తాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని, ఎవరు ఏం చేసినా చట్టాలు మా చుట్టాలు అనే భావనతో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు.
ఇదే వైఖరి అవలంబిస్తే ప్రజలు గూబ గుయ్యిమనిపిస్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పై కోర్టు సుమోటోగా తీసుకొని.. మాధవ్ వీడియో ఫేక్ కాదు ఒరిజినల్ అని అమెరికా నుంచి వచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు జరిపించాలి. కోర్టుకు ఇంకా అనుమానం ఉంటే ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించి నిజాన్ని నిగ్గు తేల్చాలి. ఎంపీ మాధవ్ సభ్యత్వాన్ని రద్దు చేసి, పార్లమెంటు నుంచి బహిష్కరించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గోరంట్ల మాధవ్ కేసుని రాష్ట్ర డిజిపి సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. ఇటువంటి చర్యలను తీసుకోవడం వల్ల కోర్టుల పై, పోలిసు వారి పై రాష్ట్ర మహిళలకే కాకుండా దేశ మహిళలకు కూడ ఒక భద్రత భావం, ధైర్యం కలుగుతాయి. గలీజు విడియో చేసిన గోరంట్ల మాధవ్ ని రాష్ట్ర బహిష్కరణ చేయాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు.