Suryaa.co.in

Andhra Pradesh

దేవాదాయశాఖలో రెవిన్యూ పెత్తనం అవసరమా?:స్వరూపానంద

అసలు దేవాలయ ఉద్యోగుల దౌర్భాగ్యం కాకపోతే..17 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లు రాకపోవడమేమిటి. రెవెన్యూ శాఖ ఉద్యోగులను మన దేవాలయాలకు ఈవో లుగా వెయ్యడమేమిటి? దేవాలయ ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలి. మీలో మీరు కోర్టులో కేసులు వేసుకోవడం వలనే..మీకు ప్రో.మోషన్లు రాక రెవిన్యూ శాఖ నుండి అధికారులుగా వస్తూ.. మీపై పెత్తనాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన నాటి నుండి..పదవి విరమణ చేసేదాక స్వామి ఉత్సవాలలో జీవితాన్ని అర్పిస్తున్నవారు దేవాలయ ఉద్యోగులు.

వైఖానసము,పంచారాత్రము, శైవాగమనము తెలియని రెవిన్యూ ఉద్యోగులు ఇక్కడ ఉద్యోగం ఎలాచేయగలరు. ప్రభుత్వం ఏదయినా నేనిలాగే మాట్లాడతా. విశాఖ శ్రీ శారదాపీఠం దేవాలయాల కోసం,దేవాలయ ఉద్యోగులకు నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. రెవిన్యూ శాఖకు భూములపై అవగాహనఉంటుందికాని దేవాలయాలపై ఉంటుందా?

సంవత్సరానికి ఇక్కడ దేవాదాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న రెవిన్యూ వ్యక్తికి 30 లక్షల పైగా జీతం ఎవరిస్తున్నారు..దేవాదాయశాఖ నుండి కాదా.. నేను మీ వెంట ఉంటా..మీరంతా ఒకసారి సమావేశం పెట్టుకోండి.. నన్ను కూడా పిలవండి..దానితో పాటు కోర్ట్ కేసుల నుండి మీలో మీరు ఉపసంహరించుకోండి. రాష్ట్రంలో అనేక ఆర్.జె.సి.,డి.సి.,ఏ.సి.పోస్ట్ లో కాళీగా ఉన్నాయి..దేవాదాయశాఖ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండండి. మీకు ప్రమోషన్లు వచ్చేటట్లు నెనుచేస్తా..

LEAVE A RESPONSE