Suryaa.co.in

Telangana

కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను కలసిన రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు

రాష్ట్ర మంత్రులు  కేటీఆర్, డా. V. శ్రీనివాస్ గౌడ్ లను రాష్ట్ర గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌడ వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వెన్నంటే యావత్తు గౌడ సంఘాలు ఉండి మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార BRS పార్టీ (TRS) కారు గుర్తు కు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు మంత్రులు కేటీఆర్, డా. V. శ్రీనివాస్ గౌడ్ గార్లను ఘనంగా సన్మానించారు.

ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు కుల వృత్తులను నిర్లక్ష్యం చేశాయని, గీత వృత్తిని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కల్లు పై నిషేధం విధించిన గౌడ ల ఆత్మగౌరవాన్ని, వృత్తిని ప్రశ్నార్థకం చేశారని గౌడ సంఘాల నేతలు మంత్రులకు తెలిపారు. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కుల రాష్ట్రంలో గౌడ సంక్షేమం ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లోని కల్లు దుకాణాల ను తేరిపించారు, కల్లు దుకాణాల కు లైసెన్సుల బకాయిలు రూ. 16 కోట్లను రద్దు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరపాలసిని ప్రకటించారు. నీరాను గౌడ్ మాత్రమే ఉత్పత్తి, అమ్మకాలు చేసే విధంగా ప్రత్యేక జీవో తీసుకొచ్చి గౌరవించారన్నారు. వైన్ షాప్ లలో గౌడ్ లకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించారన్నారు. గౌడ్ ల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకి 5 ఎకరాల వందల కోట్ల విలువైన భూమిని కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల ను కేటాయించి గౌడ్ల ఆత్మ గౌరవాన్ని పెంచిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ గౌడ సంఘాలు కృతజ్ఞత పూర్వకంగా మునుగోడు ఉప ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాట్లు గౌడ్ సంఘాల నేతలు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ గారికి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని గౌడ్ లు బి.ఆర్.ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని గౌడ సంఘాల ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు అయిలి వెంకన్న గౌడ్, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం కూరేళ్ళ వేములయ్య గౌడ్, గౌడ ఐక్య సంఘాల సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, గౌడ సంఘ ముఖ్య నాయకులు నాచగొని రాజయ్య గౌడ్, సంజయ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్, మండ వెంకన్న గౌడ్, నారగొని కుమారా స్వామి గౌడ్, ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE