Suryaa.co.in

Telangana

స్వర్ణభారతిలో స్వతంత్ర స్ఫూర్తి.!

స్వాతంత్య్ర వజ్రోత్వాలను పురస్కరించుకొని.. యువతలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చేందుకు స్వతంత్ర ఛానల్‌ చేపట్టిన స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది నగరాలలో స్వతంత్రస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించగా, తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని విద్యా సంస్థలలో స్వతంత్రస్ఫూర్తి కార్యక్రమాలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి.

స్వాతంత్య్రం పట్ల, సమరయోధుల పట్ల యువతకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. తాజాగా మంగళవారం ఖమ్మంలోని స్వర్ణభారతి విద్యా సంస్థల్లో స్వతంత్రస్ఫూర్తి కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల ప్రసంగాలు, యువతీయువకుల కేరింతలతో కార్యక్రమం ఆసాంతం2ఉల్లాసభరింతగా జరిగింది. స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్‌ కృష్ణ, ఎస్బీఐటీ ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, స్వతంత్ర న్యూస్‌ ఛానల్‌ ఎండీ కృష్ణప్రసాద్‌, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం- కృష్ణ స్వర్ణభారతి సొసైటీ చైర్మన్‌
ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలి ఈ దేశానికి స్వాతంత్య్రం అందించారని స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్‌ కృష్ణ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో3విద్యార్థులు, యువతలో స్వతంత్రస్ఫూర్తిని రగిలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. స్వతంత్రస్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్వతంత్ర ఛానెల్‌… స్వర్ణభారతి విద్యాసంస్థలను ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ దేశం మాకేమిచ్చింది అని చాలామంది అనుకుంటారు కానీ, ఈ దేశం మనకు చాలా ఇచ్చిందనే విషయాన్ని యువత తెలుసుకోవాలన్నారు. దేశం కోసం ఎంతోమంది చేసిన త్యాగాల గురించి తెలుసుకుంటే.. మనం కూడా ఈ దేశానికి ఏమైనా చేయాలనే తలంపు వస్తుందన్నారు చైర్మన్‌ కృష్ణ. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇచ్చిన స్ఫూర్తితో స్వర్ణభారతి విద్యాసంస్థల పూర్వ విద్యార్థి ఇస్రోలో కీలకంగా ఉన్నారని, తాజాగా స్వతంత్ర ఛానల్‌ ఇచ్చిన స్ఫూర్తితో ఎస్బీఐటీ విద్యార్థులు.. భవిష్యత్తులో అధ్భుతాలను అవిష్కరించాలని ఆకాంక్షించారు.

అధ్బుతమైన దేశంలో ఉన్నాం -కృష్ణప్రసాద్‌, స్వతంత్ర ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
భారతదేశంలో ఉన్న రకరకాల భాషలు, భిన్నమైన కులమతాలు ప్రపంచంలో మరే దేశంలో లేవన్నారు స్వతంత్ర ఛానల్‌ ఎండీ బి.కృష్ణప్రసాద్‌. అలాగే, 35ఏళ్లలోపు వయస్సున్న యువత దేశజనాభాలో 35శాతం ఉన్న దేశం కూడా ప్రంచంలో ఎక్కడా లేదన్నారు ఆయన. ఇంత అద్భుతమైన దేశంలో ఉన్న4మనమంతా రాబోయే పాతికేళ్లలో ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తామోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన వేళ.. మనం పొందిన స్వాతంత్య్రాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం, భవిష్యత్తులో ఈ దేశం ఏవిధంగా ముందుకు వెళ్లనుందో చెప్పడానికే కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. రాబోయే పాతికేళ్లు మీవేనని, మరిన్ని అద్భుతాలను ఆవిష్కరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు కృష్ణప్రసాద్‌.

స్ఫూర్తిని పొందాలంటే..అద్భుతం జరిగి ఉండాలి
సాధారణ మ్యాథ్స్‌ లెక్చరర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఉన్నతమైన విద్యా సంస్థలను నెలకొల్పిన స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్‌ కృష్ణ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని స్వతంత్ర ఛానల్‌ ఎండీ5కృష్ణప్రసాద్‌ అన్నారు. దేశానికి సిద్ధించిన స్వాతంత్య్రం రాజకీయపరమైనదని, ఆర్ధికంగా ఒకస్థాయికి చేరుకుంటేనే వ్యక్తిగతంగా మనకు స్వాతంత్య్రం వచ్చినట్లని చెప్పారు. అటువంటి స్వాతంత్య్రం సాధించడానికి విద్య ఎంతో ప్రధానమన్నారు. స్వర్ణభారతి విద్యార్థులు మరిన్ని అద్బుతాలను సాధించాలని కృష్ణప్రసాద్‌ ఆకాంక్షించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం
ప్రజాస్వామ్యం పతనమయ్యే దశలో పరిరక్షించే బాధ్యత న్యాయ, పాత్రికేయ వ్యవస్థలేదనన్నారు కృష్ణప్రసాద్‌. ప్రస్తుత తరుణంలో విలువలు పతనం అవుతున్నాయని గమనించి, విలువలను6 కాపాడేందుకు చేసిన ప్రయత్నమే స్వతంత్ర ఛానల్‌ ఆవిర్భావమని ఆయన చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని, వార్తావిశ్లేషణను అందించేందుకు స్వతంత్ర ఛానల్‌ కృషిచేస్తోందన్నారు.

అలాగే, కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ.. బ్రిటీషు పాలన నుంచి మనమంతా స్వాతంత్య్రం పొందేందుకు ఎందరో మహానుభావులు ఎన్నెన్నో పోరాటాలు చేశారని చెప్పారు. అటువంటి త్యాగాలను ఈ తరానికి తెలియచెప్పేటందుకు స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమాన్ని ఎంచుకోవడం అభినందనీయం అని అన్నారు ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ఈ తరం యువతలో దేశభక్తి, నైతికత విలువలను పెంచేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.

LEAVE A RESPONSE