చంద్రబాబు నాయుడుకి ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్ని గుండమే
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ పై 31వ రోజూ కొనసాగిన నిరసనలు
చంద్రబాబు నాయుడిని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అన్నారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కి నిరసనగా టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ర్యాలీలు, దేవాలయాలలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ….73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు.
స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు గారికి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందిపెట్టడమే కాకుండా ఆయన్ను అనారోగ్యంపాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. డాక్టర్ల పేరుతో జైలు సూపరింటెండ్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం జగన్ రెడ్డి కుటిల రాజకీయం భాగం కాదా?
ఒక తెల్లకాగితంపై మీ ఇష్టమొచ్చినట్టు రాసుకుని సంతకం పెట్టే అథారిటీ జైలు అధికారికి ఎవరిచ్చారు. సొంత పార్టీ ఎంపీ రఘురామరాజును శారీరకంగా హింసించి దొంగ రిపోర్టులు ఇచ్చినట్టే చంద్రబాబుగారి విషయంలో చేస్తున్నారు. చంద్రబాబు గారేమీ జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదు. జగన్ రెడ్డిలా ముద్దాయికాదు. జైల్లో పెట్టేశాం…మా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదు.
చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందితో వైద్యం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు? చంద్రబాబుగారు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.తక్షణమే చంద్రబాబు గారి వ్యక్తిగత వైద్యులను అనుమతించాలి. ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలి. చంద్రబాబు గారికి ఏమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని నేతలు అన్నారు.
టీడీపీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లినేని వెంకట రామారావు గారి ఆదేశాల మేరకు రావులకొల్లు సర్పంచ్ పూసాల వెంగప నాయుడు ఆధ్వర్యంలో షిర్డీ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర (నాని) ఆధ్వర్యంలో SVN కాలనీ ఆర్ కన్వెన్షన్ లో విష్ణు సహస్రనామ పారాయణం చేసారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంతో శ్రీ సర్వకామదాంబ సమేత శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు.
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి అమరావతి మంగళగిరిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు చేపడుతున్న సైకిల్ యాత్రను పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. కదిరి ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమంచర్ల గ్రామంలో సంఘీభావ సదస్సు చేపట్టి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ అధ్వర్యంలో నెల్లూరులోని నవాబుపేట శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్గార్జ్ డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో తెనాలి పట్టణం చిట్టి ఆంజనేయ స్వామి గుడి నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పార్థనలతో పాటు యూనిట్ స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ చింతలపూడిలో గంటా మురళీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన ధర్నా నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలంలోని జామియా మసీదు నందు మాజీ కోఆప్షన్ నెంబర్ తాహీర్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.