– తుది జాబితాతో వైకాపా మైండ్ బ్లాంక్ తప్పదు
– అభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి
– జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి
– బోండా ఉమామహేశ్వరరావు
టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించింది. అంతా సాఫీగా జరిగింది. వైకాపాలాగా కుదుపులేమీ లేవు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైంది. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జారిపోయారు. జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. టీడీపీ-జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి. దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారు. పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల.. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలి. మా పొత్తులు, మా సీట్ల గురించి ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా?
ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలి. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు.. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా? జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి.. తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే 77 మందిని బలి చేశారు. మళ్లీ మళ్లీ మారుస్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘనవిజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడనకు స్వస్తి పలకడం ఖాయం.