Suryaa.co.in

Andhra Pradesh

చనిపోయిన వారి ఫొటోలు పెట్టి బస్సు యాత్ర చేయండి

టోఫెల్ పేరుతో జగన్ సర్కారు అవినీతి
పక్క రాష్ట్రాల వారికే అన్ని కాంట్రాక్టులా?
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు

గుంటూరు అరండల్ పేట లోని హోటల్ గీతా రేజెన్సీ నందు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రమేష్ నాయుడు ఏమన్నారంటే.. రాష్ట్రంలో సామాజిక సాధికారత యాత్ర ఆదరణ లేని యాత్ర. బస్సు మీద డాక్టర్ సుధాకర్, కోడికత్తి శ్రీను , అనంతబాబు చేతిలో చనిపోయిన సుబ్రహ్మణ్యం ఫొటోలతో తిరగాలి. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనేక కార్పోరేషన్ లు వేసారు, కానీ ఈనాటికి కుర్చీలు కూడా లేని కార్పోరేషన్ లు ఉన్నాయి.

కుల, మత, ప్రాంతీయ తత్వం లేకుండా పాలన సాగిస్తామని, కులప్రస్తావన లేకుండా మీటింగ్ లు పెట్టటం లేదు. మంత్రి రాంబాబు పై దాడి చేసిన వారికి గన్ మెన్స్ తో ఖమ్మం లోనే బుద్ది చెప్పవచ్చుకదా? రాష్ట్రానికి ఎందుకు చుడుతున్నారు?

సాగు నీరు లేక రైతులు అల్లాడుతున్నారు. వారికి నీరందించే కార్యక్రమం చేపట్టండి. అనవసరమైన విషయాలను ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రక్క రాష్ట్రాలకు వెళుతున్నారు.మద్యం కారణంగా పేద, మధ్యతరగతి వాళ్ళు చనిపోతున్నారు. మా అధ్యక్షురాలు మద్యం విషయంలో లేవనెత్తిన ప్రశ్నలకు….నేటికి సమాదానం అధికారపార్టీ చెప్పలేదు.

నాసిరకమైన మద్యం అమ్ముతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత బ్రిస్లరీలో నాసిరకం మద్యం తయారు చేస్తున్నారు. మేము చర్చలకు సిద్ధం, మీరు సిద్దమా? విశ్వవిద్యాలయాల్లో 3 వేల పోస్టులకు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాలయాపన చేస్తున్నది.

సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం 12.5 శాతం మార్కులకు మాత్రమే మౌఖిక పరీక్షలు పెట్టాలి. కాని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 మార్కులకు మౌఖిక పరీక్షలు పెట్టి వైస్సార్సీపీ సానుభూతి పరులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వ్యూహం చేస్తున్నది.

టోఫెల్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు . రాష్ట్రంలో వనరులను , ప్రతి అవకాశాన్ని పక్క రాష్ట్రాల వ్యక్తులకు ప్రాజెక్టులు కట్టబెట్టుతున్నారు , కిడ్ ప్రో కో కి సులభంగా వుంటుందని. పునశ్చరణ తరగతులు సైతం అధ్యాపకులకు యూజీసీ నియమం ప్రకారం 12 నుండి 15 రోజులు శిక్షణ ఇవ్వాలి , కేవలం 3 రోజులు శిక్షణ అంటేనే తేడా కనిపిస్తున్నది. అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిరుమామిళ్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE