– ప్రజాదర్బార్లో ఎంపీ సానా సతీష్ బాబు
కాకినాడ: ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 20వ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం (సీఎంఆర్ఎఫ్)తదితర అంశాలకు సంబంధించి మొత్తం 44 అర్జీలు స్వీకరించారు. వాటిలో ఎనిమిది అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎనిమిదేళ్ళ పాప వైద్యం నిమిత్తం సీఎంఆర్ఎఫ్- ఎల్వోసీ కొరకు లెటర్ తక్షణమే అందజేయడం జరిగిందని కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అరిగెల శ్రీనివాస్(బున్ని) ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, ముత్యాల అనిల్, బండి నరేంద్ర, జున్నూరు బాబ్జి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పీఏ గౌరీ శంకర్, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.