Suryaa.co.in

Telangana

సెట్విన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సికింద్రాబాద్ : స్కూల్ లు, కాలేజీలకు సెలవుల సందర్భంగా సితాఫలమండీ లోని సెట్విన్ కేంద్రంలో వివిధ శిక్షణా కార్యకలాపాలను ముమ్మరం చేశామని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

సెట్విన్ కేంద్రం కార్యకలపాలను అయన తనిఖీ చేశారు. సిబ్బంది, శిక్షణకు వచ్చిన వారితో సదుపాయాల పై ఆరా తీశారు. 2021 సెప్టెంబరు మాసంలో సితాఫలమండీ సెట్విన్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించామని, ఇప్పటివరకు 16 వందల మందికి పైగా ఔత్సాహికులకు వివిధ అంశాల్లో శిక్షణను కల్పించామని అయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యుటిషన్, కంప్యుటర్, సీసీటీవీ, మొబైల్ రిపేర్, హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, ఫాషన్ డిజైనింగ్ తదితర అంశాల్లో ఈ కేంద్రంలో నిపుణులైన శిక్షకుల ద్వారా ఔత్సాహికులకు శిక్షణకు అవకాశం కల్పిస్తున్నామనిపద్మారావు గౌడ్ తెలిపారు.

వివిధ ఆధునాత సదుపాయాలు, అన్ని వనరులను తాము సమకూర్చి ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణా కేంద్రం కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్యా క్రమంగా పెరుగుతోందని పద్మారావు గౌడ్ వివరించారు. స్వల్ప కలిక, దీర్ఘ కలిక కోర్సులు కుడా ఉన్నాయని, వివిధ ఉద్యోగాలు, స్వయం ఉపాధికి సైతం ఈ కేంద్రంలో అందించే శిక్షణ ఉపకరిస్తోందని తెలిపారు. ఈ కేంద్రం కార్యకలాపాలను వినియోగించుకొని తమ జీవితాల్లో రాణించాలని పద్మారావు గౌడ్ సూచించారు. వివరాలకు సితాఫలమండీ సెట్విన్ కేంద్రం కోఆర్డినేటర్ నవీన్ ను గాని, సితాఫలమండీ లోని ఏం ఎల్ ఏ కార్యాలయాన్ని గాని సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE