– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ అధికార ప్రతినిధులదే కీలకపాత్ర అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఎన్. రాంచందర్ రావు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.