– ట్రాఫిక్ సర్వే ను దృష్టిలో పెట్టుకోండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: రాష్ట్రంలో దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి హ్యామ్ రోడ్ల నిర్మాణం పై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
హ్యామ్ రోడ్ల నిర్మాణ క్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణ క్రమంలో ట్రాఫిక్ సర్వేను గమనంలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. మొదటి పేజ్ కు అతి త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ హరిత పలువురు ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.