-వెంకట్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనపై చర్యలు తీసుకోరా?
-నల్గొండ జిల్లాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు భూ స్థాపితం అవుతాయి
-వెంకట్ రెడ్డి రాజకీయాలు చాలు అనడం కాదు. ప్రజలే వాళ్ళని పక్కకి పెట్టే సమయం వచ్చింది
-వెంకట్ రెడ్డి దెబ్బతో వాళ్ళ తమ్ముడికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది
– తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రతి ఇల్లు మాదే. రాజ్ గోపాల్ కి బుద్ది జ్ఞానం లేదు. ఆయనకి సిగ్గులేదు. మధం పట్టి, ప్రజల ఆత్మ గౌరవంతో రాజ్ గోపాల్ ఆడుకుంటున్నాడు. రాజగోపాల్ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు. మునుగోడులో గెలిస్తే 1000 కోట్ల బడ్జెట్ తెస్తానని అంటున్నాడు. ఎక్కడి నుండి తెస్తాడు. రాజ్ గోపాల్ ఓడిపోతే నల్గొండ జిల్లా ఆయన్ని పూర్తిగా మర్చిపోతుంది. రాజగోపాల్ కాంట్రాక్టుల గూర్చి తప్పా ఇంకేమీ మాట్లాడడు. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చాడని రాజగోపాల్ ఒప్పుకున్నాడు. మునుగోడు వచ్చే బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకి ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ రాకముందు, వచ్చాక మునుగోడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. మునుగోడు ప్రధాన సమస్య ఫ్లోరైడ్. అరవై ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదు. పెన్షన్ ఎక్కువగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
బీజేపీ గొల్లకుర్మల కడుపు కొట్టింది. ప్రజలు రాజ్ గోపాల్ పైసలు తీసుకొని, ఆయనకు సున్నం పెడుతారు. బీజేపీ ఎన్నికల సంఘాన్ని కూడా వాడుకుంటుంది. రిజల్ట్ లో ఏ పార్టీకి అందనంత దూరంలో మేం ఉంటాం. మాకు తిట్టడానికి చేత కాక కాదు. మేం బీజేపీ వాళ్ల కంటే ఎక్కువగా తిడుతాం. ముగ్గురు ఎమ్మెల్యేలు మా ప్రభుత్వాన్ని పడగొడుతారా? బీజేపీ మాటలు వింటే రాళ్లతో నెత్తి పలగొట్టుకోవాలి అనిపిస్తది. టీఆర్ఎస్ మద్యం పంచుతుందనే గాలి మాటలోద్దు. మేం మందు, డబ్బులు పంచితే సెంట్రల్ ఫోర్సెస్ పెట్టుకోవచ్చు కదా.