టిడిపితో పొత్తు ఉండదు

Spread the love

-మా పొత్తు జనసేనతోనే
-బిజెపి కో ఇన్చార్జి సునీల్ దియోధర్ స్పష్టీకరణ

బీజేపీ ఏపీ శాఖలో ఇటీవల చోటుచేసుకున్న కీలక పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దేవ్ ధర్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోమని కూడా ఆయన తేల్చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలను ఎదురు చూశామన్నారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇక ఏపీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలమయ్యారంటూ ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా దేవ్ ధర్ స్పందించారు. కన్నా వ్యాఖ్యలను తామేమీ అంత సిరీయస్ గా తీసుకోవడం లేదన్నారు. పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని, అవేమీ అంత పెద్దగా పట్టించుకునే వ్యాఖ్యలు కూడా కాదన్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ అందజేతపై అంతర్గతంగా చర్చించుకుంటామని దేవ్ ధర్ తెలిపారు

Leave a Reply