Suryaa.co.in

Telangana

సనత్ నగర్ సర్వేలో తలసానిదే గెలుపు: పీ.ఎల్. శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రమంతటా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పొలిటికల్ స్ట్రాటజిస్టు పీ.ఎల్. శ్రీనివాస్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పీ.ఎల్. శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలుసుకొని, పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా పీ.ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. సనత్ నగర్ నియోజకవర్గంలో అన్నా అని పిలిస్తే.. నేనున్నా అని పలికే తలసానికే ప్రజలు మళ్లీ పట్టం కడతారని తమ సర్వేలో తేలిందన్నారు. సనత్ నగర్ అభివృద్ధి కోసం రాత్రనక, పగలనక పనిచేస్తూ ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటూ, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు తదితర ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో తలసాని ముందున్నారని సర్వేలో ప్రజలు చెబుతున్నారని పీ.ఎల్. శ్రీనివాస్ తెలిపారు.

తలసాని ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గం అంతటా చక్కని రోడ్లు వేశారని, క్రీడా మైదానాలు, గ్రేవ్ యార్డులు నిర్మించారని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే శ్రీనన్నే మళ్లీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని తమ సర్వేలో ప్రజలు తేల్చిచెబుతున్నారని పీ.ఎల్.శ్రీనివాస్.. ఈ సందర్భంగా తలసానికి వివరించారు.

LEAVE A RESPONSE