– ఖరారు చేసిన చంద్రబాబు
తంగిరాల ప్రభాకర్ దగ్గర డబ్బు లేదు. తంగిరాల సౌమ్య దగ్గర డబ్బు లేదు. అయినా నేను సౌమ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్న. దానికి కారణం వారికి పార్టీపై ఉన్న నిబద్ధత.
నియోజకవర్గంలో ఇద్దరు రాక్షసులను ఎదుర్కొంటున్న సౌమ్య ను ప్రత్యేకంగా అభినందించాలి. సౌమ్య టికెట్టు ఎప్పుడో ఖరారు చేశాను.అందరూ కలిసి పని చేయండి.నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీదే. ఎవరైనా తెలుగుదేశం పార్టీ గొడుగు కింద పని చేయాల్సిందే. వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత భజనలు ఆపండి.
నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది అన్ని విషయాలు నాకు తెలుసు.
వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత భజనలు ఆపండి..అందరూ కలసికట్టుగా సౌమ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిందే. కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. కొంతమందిని వదులుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.