– చంద్రబాబు హాజరుకారు
– సీఎంగానే మళ్లీ సభకు వస్తారు
– టీడీపీఎల్పీ నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ప్రకటించింది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మండలిలో పార్టీ నేత యనమల రామకృష్ణుడు, శాసనసభాపక్ష ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే..
కింజారపు అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరుపుకున్న శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరు అయ్యేందుకు నిర్ణయించడం జరిగింది. శాసనసభ చరిత్రలో గత 3 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేత సభ్యునికి, అధికార పక్షంలోని ముఖ్యమంత్రి నుంచి సభ్యుని వరకు ఎన్ని అవమానాలు చేసినా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను శాసనసభలో ప్రశ్నించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గతంలో ప్రతిపక్ష పార్టీగా కనీసం చెప్పకుండా శాసనసభ నుంచి పారిపోయిన జగన్ రెడ్డిని గుర్తు తెచ్చుకోవాలి. కాని 40 ఏళ్లు టీడీపీ అధికారం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమైన భూమికను పోషిస్తున్నాం. నేడు రాష్ట్రంలో అనేకమైన సమస్యలున్నాయి. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమవేశాలకు రాకుండా పారిపోతున్నామన్నారు. మీరు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ గురించి, మీ పార్టీ శాసనసభ్యుల గురించి మాట్లాడుకోండి.
గత 3 ఏళ్లల్లో ప్రభుత్వం ప్రధానమైన నిర్ణయం తీసుకునే ముందు శాసనసభ, సభ్యులకు తెలియజేసి తీసుకుంటారు. కాని మీరు రాజధాని బిల్లుల ఉపసంహరణ, రాజధాని కొత్త బిల్లు తీసుకువచ్చినప్పుడు సడన్ గా శాసనసభలో చూసి చాలా మంది మీ పార్టీ సభ్యులే విస్మయం చెందాం. కాబట్టి మీరు వారి గురించి ఆలోచన చేయండి. అంతే గాని మా గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేము శాసనసభకు వస్తాం. ప్రజా సమస్యలను లేవనెత్తుతాం.
ఈ మూడేళ్లల్లో మేము ఎప్పుడు మైక్ అడిగినా ఇవ్వలేదు. కనీసం వాక్ అవుట్ చేసే అవకాశం ఇవ్వలేదు. మేము భాధ్యతగా ప్రవర్తించాo. రైతు సమస్యలు చాలా ఉన్నాయి. రాజధానిపై తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా వైసీపీ సభ్యులకు బుద్ది రాలేదు. ఇప్పుడు కొత్తగా చట్టం తీసుకువస్తామని చెబుతున్నారు. పోలవరం 70 శాతం పూర్తి చేస్తే మీరు ఒక్క శాతం పూర్తి చేయలేదు. ఎత్తు తగ్గించి పోలవరాన్ని బ్యారేజీగా మార్చే కుట్ర చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్లు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది, బాబాయ్ హత్యపై శాసనసభలో చర్చ లేవనెత్తుతాం.
మీకు చిత్తశుద్ధి ఉంటే మేము లేవనెత్తిన సమస్యల మీద చర్చ పెట్టాలి. మాకు అవకాశం ఇవ్వాలి. దానికి మీరు సమాధానం చెప్పాలి. ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు. కనీసం శాసనసభకు మేము వచ్చామో లేదో ప్రజలకు తెలియటం లేదు, మా మోహాలు కూడా చూపించడం లేదు. ప్రజా సమస్యలను లేవనెత్తమని చాలా మంది ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు. ఉద్యోగుల పీఆర్సీ గురించి మేము సమావేశాల్లో లేవనెత్తుత్తాం. శాసనసభ ఒక పవిత్రమైంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రతిపక్షం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి తెలిసి విలువ ఇచ్చేవారు. కాని జగన్ రెడ్డి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు.
సమస్యలన్నింటిని బీఏసీ మీటింగ్ లో చర్చిస్తాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అసెంబ్లీ పేద వాళ్ల సమస్యలను కాపాడేందుకు ఒక వేదిక. దీనిని సరైన మార్గంలో నడిపించాలి. మీకు ఏది అవసరమో ఆ సమాచారం మీ చానల్ కు ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యల మీద చర్చిస్తున్న విషయాలను ప్రజలకు చూపించడం లేదు. స్పీకర్ వైసీపీ నాయకుడిలా కాకుండా ప్రతిపక్షానికి సరైన సమయం ఇస్తారని ఆశిస్తున్నాం. కొన్ని చానల్ కు ప్రసారాలు ఇవ్వడం లేదు. మీడియా గొంతు నొక్కాలనుకోవడం సమంజసం కాదు. ప్రతి ఒక్క సభ్యుడు లేవనెత్తిన సమస్యలు ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఆ మాటకు కట్టుబడే ఉన్నారు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ప్రజా సమస్యల మీద చర్చించేందుకు సిద్దమయ్యాం. అమరావతి, పోలవరం, ప్రత్యేకహోదా, నిరుద్యోగులు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ కోతలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఇలా అనేక సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తాం.
యనమల రామకృష్ణుడు:
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి శాసనసభను ఒక దేవాలయంలా చూస్తుంది. చట్ట సభల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష పాత్ర వహించాం. చట్టసభల్లో టీడీపీ ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలను లేవనెత్తి సమస్య పరిష్కరిస్తారానికి ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేయడం టీడీపీతోనే సాధ్యం. కాని వైసీపీ అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చట్టసభలను గౌరవించలేదు. వైసీపీ నాయకులు 2 ఏళ్లు చట్టసభలకు రాకుండా పారిపోయారు.
ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా చేయాలని చూస్తున్నారు. మీడియాకు స్వేచ్ఛ ఇవ్వకుండా, లైవ్ టెలీకాస్ట్ వాళ్ల ఒక్కరి సొత్తేలా ముఖ్యమంత్రిని మాత్రమే చూపిస్తున్నారు. మీడియా సెంటర్ ను వాళ్ల ఒక్కరికే పరిమితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీకి భయం. నేడు అనేక సమస్యలు ఉన్నాయి. చట్ట, రాజ్యాంగ , ప్రజా వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సొంతానికి వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదనది చెప్పడానికి అసెంబ్లీకి అటెండ్ అవుతున్నాం.
సమస్యలను చర్చించడానికే వస్తున్నాం. అనుభవం ఉన్న ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నెరవేస్తున్నాం. మాకు ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వండి. హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్లీ మూడు రాజధానుల మీద చట్టం తీసుకువస్తామని చెబుతున్నారు. మళ్లీ అదే చట్టాన్ని తీసుకువస్తామని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం. ఇలాంటి సమస్యలను చర్చించాలి. సభలో చర్చించే అవకాశం ఇవ్వకపోతే మీరుపారిపోయారన్న భావన ప్రజల్లో కలుగుతుంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి:
ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు ప్రాధాన్యం ఉంది. చట్ట సభలను కాపాడి ప్రజాసమస్యల పరిష్కారినికి వేదికగా వాడుకోవాలి. రాజ్యాంగo ప్రకారం ఎంత మంది సభ్యలున్నా సమాన అవకాశం కల్పించాలి. మెజారిటీ ఉంది కదా అని ప్రతిపక్షం గొతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలా లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వడం లేదు. మేము అలా చేస్తే గతంలో జగన్ రెడ్డి మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదా?
ప్రతిపక్ష నాయకుడిపై హేళనగా మాట్లాడిన సభ్యులపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. స్పీకర్ భయట కూడా బూతులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మంత్రులు బూతులు మాట్లాడితే కనీసం రికార్డ్ నుంచి తొలగించరు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను ఎత్తే అవకాశం ఇవ్వడం లేదు. మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టానుసారం చేస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. న్యాయ వ్యవస్థ వాళ్ల చెప్పు చేతల్లో ఉండాలన్న భావనలో ఉన్నారు. అందుకే న్యాయవాదులు, న్యాయమూర్తులపై దూషణలు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.
ఆర్ధికంగా రాష్ట్రం దివాళా తీసింది. పోలవరం ప్రశ్నార్ధకమైంది. 3 ఏళ్లల్లో ఎన్ని రోజులు శాసనసభ నిర్వహించారు, ప్రతిపక్ష పార్టీకి ఎంత సమయం ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు ఎంత సమయం ఇచ్చారో రికార్డ్ చూస్తే తలదించుకోవాల్సి వస్తుంది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే దారి తప్పిన ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే రాష్ట్రం మునిగిపోతుంది.
బడ్జెట్ లో చూపించకుండా రూ.96వేల కోట్లు పక్కదారి పట్టారు. వివేకానంద రెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అన్నారు, తరువాత గుండెపోటు అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువులు అందులో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. మాకు చాలా బలం ఉంది కాబట్టి మా ఇష్టమని సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు. నియంతృత్వ పోకడలకు వెళితే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. చంద్రబాబు నాయుడుగారికి అవమానం జరిగినా ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్దమయ్యాం.