బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల-ఆత్మహత్యల తెలంగాణ చేసిన కేసీఆర్

– బియ్యం బుక్కితే కడుపు నిండదు కేసీఆర్
– ముదిగొండ మండలం పెద్ద మండవ పాదయాత్రలో సర్కార్ పై భట్టి విక్రమార్క ఫైర్

నా పాదయాత్ర ఎన్నికల కోసం. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ పోరుయాత్ర. రైతుబంధు పేరిట ఎకరానికి 5వేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏటా 30 వేల వరకు నష్టపరుస్తుంది అని వివరించారు.”రైతులను వరి సాగు చేయోద్దని. వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకోవాలన్న సీఎం కేసీఆర్ అధికారానికి, వచ్చే ఎన్నికల్లో ఉరి వేయడానికి రైతులు సిద్ధంగా ఉండ్రు.

“బియ్యం బుక్కితే కడుపు నిండదు కేసీఆర్”
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమ్మహస్తం సరుకులు ఏవి? ధనిక రాష్ట్రంలో 9 సరుకులు ఇవ్వడానికి ఎదురు లేవా? నీకు చేతులు రావడం లేదా టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో చేసిన
bhatti-mudi1 రాజకీయాలతో రైతుల ప్రాణాలను తీసిండ్రు బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ చేసిన సీఎం కెసిఆర్ బంగారు భారత్ చేస్తానని బయలుదేరడం విడ్డూరంగా ఉంది.

నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా బంగారు తెలంగాణ ఎట్లా చేసినవ్.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పాలనలో 8 ఏళ్లు దాటుతున్నా, నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలు నెరవేరనందునే… సర్కారుపై సమర యాత్ర చేయడానికే పీపుల్స్ మార్చ్.

Leave a Reply