Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో టిడ్కో ఇల్లు మంజూరైతే.. వైసీపీ రద్దు చేసింది!

– నేతల భూ కబ్జాలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
– వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్ల పునరుద్దరణకు ఆదేశాలు
– వినతులు, ఫిర్యాదులు స్వీకరించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

మంగళగిరి: కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, యర్రగుంట్ల గ్రామానికి చెందిన మైలాపురం లక్ష్మీదేవి విజ్ఞప్తి చేస్తూ… 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తనకు టిడ్కో ఇల్లు మంజూరు అయినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఇల్లు రద్దు చేసినట్టు ఆమె ఫిర్యాదు చేశారు.

తనకు న్యాయం చేయాలని ఆమె మంత్రిని కోరారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అర్జీలు స్వీకరించారు. మంత్రి ఈ విషయంలో వెంటనే స్పందించి, సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినందున, సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా చర్చించి, సమస్యల వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, యర్రగుంట్ల గ్రామానికి చెందిన మైలాపురం లక్ష్మీదేవి అనే మహిళ విజ్ఞప్తి చేస్తూ.. 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో తనకు ప్రభుత్వం టిడ్కో ఇల్లు మంజూరు చేసిందని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ఇల్లు రద్దు చేసి, తన పేరుతో టిడ్కో ఇల్లు మంజూరు కాలేదని తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

కడప జిల్లా, కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బాలిబోయిన రమణయ్య గీవెన్స్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మహానందిపల్లె గ్రామానికి చెందిన షేక్ అనే వ్యక్తి వైసీపీ నాయకుల అండతో దొంగ వికలాంగ సర్టిఫికేట్ పొందినట్టు ఆరోపించారు. షేక్ అర్హత లేని పింఛన్ తీసుకుంటున్నారని పేర్కొంటూ, అతనిపై దర్యాప్తు చేసి పింఛన్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, కృష్ణాపురానికి చెందిన కె.యశ్వంత్ విజ్ఞప్తి చేస్తూ.. తన కుటుంబం 35 ఏళ్ళుగా సాగుచేస్తున్న వ్యవసాయ భూమిని కొంతమంది వైసీపీ నాయకులు మూడేళ్ళుగా రౌడీయిజం చేస్తూ కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు.

అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, షేక్సానుపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఎర్రిస్వామి విజ్ఞప్తి చేస్తూ.. వజ్రకరూరు మండలం, జరుట్ల రాంపురం గ్రామంలో తనకు చెందిన అయిదు ఎకరాల భూమికి సంబంధించిన అడంగల్ రికార్డును ఆన్‌లైన్‌లో తొలగించి, చంద్రప్ప అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన పేరుతో పట్టా నమోదు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. తన భూమిని తిరిగి తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, చిన్నతిప్పసముద్ర గ్రామానికి చెందిన బి.ఉత్తమరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. 2019 ముందు తనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ లభించేదని, కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తన పింఛన్ రద్దు చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మంత్రిని వేడుకోగా, మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, పింఛన్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెనాలి, తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అక్షరున్నీసా ఫిర్యాదు చేస్తూ, తన కుమారుడు సలీమ్ మెహిద్దీన్ భార్య ప్యారేజాన్ వద్ద రూ. నాలుగు లక్షలు అప్పుగా తీసుకున్నట్టు తెలిపారు. ఆ అప్పును తర్వాత పూర్తిగా తీర్చినా, మెహిద్దీన్ తనకు చెందిన రూ. 30 లక్షల విలువైన ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE