– రైతులకు ఇచ్చే సున్నా వడ్డీని గుండు సున్నా చేశారు
– జగన్ ఇక్కడ పులి…ఢిల్లీ లో పిల్లి…ఏమి తేలేడు
– నాపై కేసుకు తవ్వి తవ్వి నా వెంట్రుక కూడా పీకలేక పోయారు
– చేతగాని దద్దమ్మలు కులం, మతం ముద్ర వేస్తారు
– గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి పంట వెయ్యక ఏమి వేస్తారు?
– తెలుగు రైతు రాష్ట్ర వర్క్ షాప్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
హనుమాన్ జంక్షన్: రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ను మూసేశారు. మిర్చి కి తెగుళ్లు వచ్చి రైతులు 5 వేల కోట్లు నష్టపోయారు. మిర్చి రైతు ను పలకరించే వారు లేకుండా పోయారు. 5 ఏళ్ల టీడీపీ హయాంలో ఒక్కరోజు కరెంట్ పోలేదు. ఇప్పుడు విద్యుత్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
రైతుల మోటార్ల కు మీటర్లు పెట్టి అన్నదాతలకు ఉరితాళ్లు వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వని సీఎం….రైతుల కరెంట్ బిల్లు లు కడతారా? రైతుల సమస్యపై రైతులు కూడా సమిష్టిగా పోరాటం
చేయాలి. రెండేళ్లలో జగన్ శాశ్వితంగా ఇంటికి పోతాడు. టీడీపీ హయాం రైతుకు స్వర్ణయుగం. రాయల సీమలోహార్టికల్చర్ కు ప్రాధాన్యం ఇచ్చాం.
గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి పంట వెయ్యక ఏమి వేస్తారు? నాడు నదుల అనుసంధానం అంటే విమర్శలు చేశారు….కానీ పులివెందులలో చీనీ చెట్లకు నీళ్ళు మేమే ఇచ్చాం. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2010 కే పోలవరం పూర్తి చేసే వాళ్ళం. పోలవరం ప్రాజెక్ట్ కట్టమంటే పోలవరం బ్యారేజ్ కడతాం అంటున్నారు.
జగన్ ఇక్కడ పులి.ఢిల్లీలో పిల్లి.ఏమి తేలేడు. బాబాయ్ హత్య లా తమనూ ఏదైనా చేస్తారని కొన్ని మీడియా వర్గాలు భయపడుతున్నాయి. నాడు ntr హయా లో తెలుగు గంగతో రాయలసీమలో ఆశ చిగురించింది. ఇప్పుడు జగన్ రాయలసీమ lift irrigation తో వివాదం తెచ్చి నదుల పై పెత్తనం కూడా కేంద్రానికి అప్పగించారు.
మన ఊళ్ళో కాలువలు తవ్వాలి అన్నా కేంద్రాన్ని అడగాలి. కరెంట్ ఉత్పత్తి అని చెప్పి శ్రీశైలం నీళ్ళు అన్ని వాడేసారు సీజన్ లో వర్షాలు పడకపోతే అప్పుడు ఏం చేస్తాం…సీఎం కు ముందు చూపు లేదు. జగన్ తన వైఖరితో రైతు ద్రోహిగా మారిపోయారు.
రైతులకు ఇచ్చే సున్నా వడ్డీని గుండు సున్నా చేశారు. కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి రైతు భరోసా అంటున్నాడు. అధికారం లోకి వచ్చిన తరువాత 4,5 విడతల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీపై నాడు
మేము ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేశారురాష్ట్రం లో ఎక్కువ డబ్బు ఉండే వ్యక్తి జగన్.ఎక్కువ అప్పులు ఉండే వారు తెలుగు రైతులు.ద్రౌపతి ని నాడు ఎలా అవమానించారో…జగన్ అమరావతి రైతులను అలా అవమానించారు. ప్రధాని నాడు అమరావతి కి పార్లమెంట్ అండగా ఉంటుంది అన్నారు. అందుకే ఇప్పుడు చట్టం గెలిచింది అనుకుంటున్నాను.
జగన్ కు అమూల్ పై ఎందుకు అంత ముద్దు…అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాష్ట్ర ఆస్తులు దానం చేస్తున్నాడు.కుల ముద్ర వేసి అమరావతి ని చంపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ధర్మం
గెలిచింది. చేతగాని దద్దమ్మలు ఇలా కులం, మతం ముద్ర వేస్తారు. మనం IT ఉద్యోగాలు ఇస్తే…జగన్ మరుగు దొడ్ల దగ్గర ఉద్యోగాలు ఇస్తున్నారు.
వ్యవస్థల ధ్వంసం వల్లనే కురుపాం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వైఎస్ కోటలో బాబాయ్ చనిపోతే నా చేతిలో గొడ్డలి పెట్టి ప్రచారం చేశారు. వివేకా గొడ్డలి పోటుకు గురైతే గుండె పోటుతో చనిపోయారు అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవాలు అన్ని బయటకు వస్తున్నాయి. ఇంట్లో భార్యా భర్తలు కాపురం చెయ్యక పోయినా…PRC కోసం ఉద్యోగులు రోడ్డెక్కినా నేనే కారణం అన్నారు.
తెలుగు దేశం తిరుగులేని పునాది పై వచ్చిన పార్టీ….ఎవరూ ఏమీ చెయ్యలేరు.నాపై కేసుకు తవ్వి తవ్వి…నా వెంట్రుక కూడా పీకలేక పోయారు. వైసీపీలో ఉంటే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే….ఆ పార్టీ లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. జగన్ కు వచ్చిన ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అవుతుంది…విర్ర వీగిన జగన్ కు దారుణ ఓటమి తప్పదు.