Suryaa.co.in

Andhra Pradesh

దండా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు..

ఏపీ కాటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దండా ప్రసాద్ అకాల మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

గుంటూరులోని జ్యోతిర్మయి అపార్ట్మెంట్లో తన నివాసానికి మంగళవారం రాత్రి ఆయన విచ్చేసి ప్రసాదు తండ్రి దండా బ్రహ్మానందం ఆయన
danda కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. యువకుడైన ప్రసాద్ మరణం కాటన్ టెక్స్ టైల్స్ రంగానికి తీరని లోటు అని అన్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ టీజే జనార్ధన్, రావెళ్ళ సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ , పట్టణ టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు వున్నారు.

LEAVE A RESPONSE