Suryaa.co.in

Andhra Pradesh

‘దగాబడ్డ ఆంధ్ర రాష్ట్రమా’..

ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రూపొందించిన ‘దగాబడ్డ ఆంధ్ర రాష్ట్రమా’ అనే గీతాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసేలా రూపొందించిన ఈ పాట సందేశాత్మకంగా ఉందన్నారు. ప్రజలను ఉత్తేజపరిచేలా మరిన్ని పాటలను రూపొందించాలని అన్నారు. ఈ సందర్భంగా

అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఈ పాటను రూపొందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, వైవీబీ రాజేంద్రప్రసాద్, టిడి జనార్థన్, కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE