ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసాన్ని నిరసిస్తూ దుర్గికి వెళుతున్న టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులను ఆంక్షలను బేఖాతరు చేస్తూ, టీడీపీ వికలాంగ నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని వికలాంగుల కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ అభిమానులు వచ్చే ఎన్నికల్లో వైసీపీని సమాధి చేస్తారని హెచ్చరించారు. దుర్గి గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉన్న భయపడకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల గౌరవ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు , రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చిలుముల దుర్గారావు, అజయ్, దివ్యాంగులు దుర్గి మండల కేంద్రంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా నిరసన కార్యక్రమం చేపట్టారు.