Suryaa.co.in

Telangana

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయండి

– చంద్రబాబు పిలుపు

తెలంగాణ లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం మరింత చురుగ్గా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నూతన సంవత్సర
ts-tdp1పురస్కరించుకొని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో పలువురు నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు .

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు .పార్టీ కార్యక్రమాల గురించి చంద్రబాబుకు వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో పార్టీ నాయకులు కార్యకర్తలతో
tdp-ts3 సమావేశమవుతామని చెప్పారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ రూపొందించుకోవాలని తెలంగాణ నాయకులను ఆదేశించారు.

చంద్రబాబును కలిసిన వారిలో టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, ప్రదీప్ చౌదరి, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు అశోక్ గౌడ్, సుభాష్ , రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర ఎస్సీ సెల్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అశోక్ కుమార్, పి. రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE