అమరావతి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి కీలక విజయాలు లభించాయి. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో సర్పంచ్ పదవులు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. కొండపిలో కొమ్ము సుశీల, కడియపులంకలో మాదిశెట్టి పద్మావతి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
మాచర్లలో వేపకంపల్లి ఎంపీటీసీ, నెల్లూరు జిల్లాలోని విడవలూరు-1 ఎంపీటీసీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.
ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో, టీడీపీ అభ్యర్థులు పోటీ లేకుండా విజయం సాధించారు. కొండపి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు గత 15 ఏళ్లుగా కోర్టు సమస్యల కారణంగా నిలిచిపోయి ఉండగా, ఈసారి కోర్టు క్లియర్ కావడంతో తొలిసారి ఎన్నికలు జరిగాయి.