Suryaa.co.in

Andhra Pradesh

గోదావరి జిల్లాలపై టీడీపీ ఫోకస్

– ఉభయ గోదావరి జిల్లాల సమస్యల పరిష్కారంపై పోరాటం

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలయిన ఉభయ గోదావరి జిల్లాలపై ఆ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించింది. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని రెండు జిల్లాలకు చెందిన టీడీపీ జిల్లా నాయకులు తీర్మానించారు. తాజాగా నిర్వహించిన రెండు జిల్లాల పార్టీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మేరకు పోరాట కార్యక్రమాలను ఖరారు చేశారు.

రాజమహేంద్రవరం: ఉభగోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం రాజమహేంద్రవరంలోని హోటల్‌ రివర్‌ బేలో జరిగింది. ఈ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగింది. రెండు జిల్లాల నాయకుల అభిప్రాయం మేరకు 16 తీర్మానాలను ఆమోదించి గోదావరి జిల్లాల ప్రజల పక్షాన ఉద్యమించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అభివృద్ధికి చిరునామాగా ఉన్న గోదావరి జిల్లాలలో నేడు జగన్ మూడు సంవత్సరాల కాలంలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా, సవతి తల్లి ప్రేమ చూపుతున్న కారణంగా వెనుకబడిపోతున్న గోదావరి జిల్లా ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

పోలవరం ప్రాజెక్టు ను అసెంబ్లీలో జగన్ మొదట 2021 జూన్ కి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 2021 డిసెంబర్ కి పూర్తి చేస్తామని చెప్పి నేటికీ పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు రాకపోవడం వల్ల గోదావరి డెల్టా స్థిరీకరణ జరగక పోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పోరాడాలని
godavari నిర్ణయించడం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతాన్ని తగ్గించుకొని తద్వారా నిర్వాసితుల ప్యాకేజీ తగ్గించుకోవడానికి కేంద్రం నుండి 55 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు వ్యయం ఆమోదించు పోలవరం ఎత్తు 150 అడుగులు నుండి 135 అడుగుల తగ్గించే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.

పోలవరం నిర్వాసితులకు నాడు జగన్ పాదయాత్రలో ఎకరానికి 10 లక్షల 50 వేలు ఇస్తామని, 2006 సంవత్సరానికి ముందు ల్యాండ్ ఎక్విజేషన్ అయిన భూమికి కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందించకపోవడం ని వ్యతిరేకించి నిర్వాసితుల పక్షాన పోరాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ శాఖ మంత్రి వరి సాగు వద్దు అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ రైతులకు ఉరితాడు బిగించడాన్ని వ్యతిరేకిస్తుంది.

గోదావరి ఉభయ జిల్లాల రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రాయతీలు అందించకపోగా, విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడాన్ని రైతు పక్షాన తీవ్రంగా వ్యతిరేకించి, రైతు పక్షాన పోరాడాలని నిర్ణయించడం జరిగింది. ధాన్యం బకాయిలను రైతులకు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. డెల్టా ఆధునీకరణ పనులు జగన్ చేపట్టక పోవడం వలన సాగునీరు అందక దళ్వాకు నీటి ఎద్దడి, డ్రైనేజీ నీరు బయటకు పోక సార్వ పంట ముంపుకు గురి అవుతూ డెల్టాలో క్రాప్ హాలిడే తీసుకున్న రైతులకు అండగా పోరాడాలని నిర్ణయం.

గోదావరి జిల్లాలో కొనుగోలు లేక మద్దతు ధరలు లేక, సంక్షోభంలో ఉన్న చేపల, రొయ్యల రైతుల పక్షాన మరియు గోదావరి జిల్లాలలో కొబ్బరితో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పోరాడాలని నిర్ణయం. గోదావరి జిల్లాల్లో అద్వానంగా ఉన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని నిర్ణయం. గోదావరి చెంతన ప్రకృతి సహజ సిద్ధంగా ఇసుక ఉన్నా, వేల రూపాయలు వెచ్చించినా ఇంటికి తెచ్చుకోలేని గోదావరి జిల్లాల ఇళ్ళ నిర్మాణదారులు, భవన కార్మికులకు అండగా పోరాడాలని నిర్ణయం.

మూడు సంవత్సరాల జగన్ పాలనలో ఒక్క ఇల్లు నిర్మాణం లేదు, కట్టుకొన్న ఒక ఇల్లుకి బిల్లు లేదు, ఆఖరికి కట్టిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు ఉచితంగా స్వాదీనం చెయ్యకపోగా , ఎప్పుడో 20, 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు OTS పేరున అక్రమ వసూళ్లను ఖండిస్తూ లబ్ధిదారులకు పక్షాన నిలబడాలని నిర్ణయం. ఏలేరు ఆధునీకరణ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం త్రిప్పాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలపై పోరాటం చేయాలని తీర్మాణం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశంపార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎండి షరిఫ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మలరామానాయుడు, ఆదిరెడ్డి భవాని, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్లమెంట్ అధ్యక్షులు కెఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, రెడ్డి అనంతకుమారి, జ్యోతుల నవీన్, తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, మాజీ శాసనమండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, నియోజవర్గాల ఇన్‌చార్జులు, మాజీ ఎమ్మెల్సీలు వివివి చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE