– అందుకే ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికంటూ ఈనాడు తప్పుడు రాతలు
– రామోజీ…ఇక నీ రోత రాతలు కట్టిపెట్టు..
– అసలు మీ చంద్రబాబుకు, ప్రతిపక్షాలకు ఓటేసే వారు ఎవరు..?
– బీసీలు దెబ్బకు టీడీపీ కుప్పకూలిపోవడం ఖాయం
– కులగణన చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం అధికారమిచ్చింది.
– అందుకే బీహార్‌లో కూడా కులగణన జరిగింది
– రాష్ట్రం చేసే కులగణనకు చట్టబద్ధత లేదనడం పచ్చి అబద్ధం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
బాబు హయాంలో తామంతా మోసపోయామని బీసీలు తెలుసుకున్నారు:
వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి..జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చైతన్యవంతులయ్యారు.వాస్తవాలు తెలుసుకున్నారు..బాబు హయాంలో తాము మోసపోయామని తెలుసుకున్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఈ వర్గాలను జీవన ప్రమాణాలు పెరగకుండా చేశాడు. పేద వాడి ఆశలు నెరవేరక, తన ఆత్మగౌరవాన్ని మీలాంటి పెత్తందారుల వద్ద తాకట్టు పెట్టి జీవించే స్థితి నుంచి నేడు మార్పు వచ్చింది.వైఎస్ జగన్ నేతృత్వంలో ఏ పేదవాడు పెత్తందార్ల వద్దకు వెళ్లనవసరం లేకుండా డీబీటీ అనే విధానాన్ని తీసుకొచ్చారు.
పెత్తందారులు వీరిని ఎలా దోచుకుంటున్నారో జగన్ గమనించి ఈ డీబీటీ తీసుకువచ్చారు. నేడు రూ.2.40లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది. దాంట్లో అవినీతి జరిగిందని మీరు చెప్పగలవా? అదే చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలు ఎన్ని ఘోరాలు చేశారో అందరూ చూశారు. పింఛన్ ఇవ్వాలంటే వృద్ధుల వద్ద లంచాలు తీసుకున్నారయ్యా మీరు. ఇళ్లివ్వాలంటే యజమానికి వచ్చేది రూ.40వేలు అయితే పదిశాతం చొప్పున రూ.4వేలు లంచాలు తీసుకున్నారు.
కులగణన జరుగుతుంటే టీడీపీ కూసాలు కదులుతున్నాయి:
నేడు కులగణన జరుగుతుంటే టీడీపీకి కూసాలు కదిలిపోతున్నాయి. టీడీపీ వారెప్పుడూ బీసీల మనోభావాలను అర్ధం చేసుకోలేదు..కేవలం బీసీలను ఓట్ల యంత్రాలుగా చూశారు. భారత దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని అనేక చోట్ల డిమాండ్లున్నాయి. టీడీపీ వారు ఆరు సార్లు కేంద్రానికి పంపారట..చెయ్యాలనే చిత్తశుద్ది లేని వారి మాటలు ఇలానే ఉంటాయి. మేం 2021 నవంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి జనగణనలో కులగణన చేయించాలని కోరాం. మేం చేసే కులగణనకు చట్టబద్ధత లేదని చెప్పడం కంటే పెద్ద అబద్ధం ఏముంది..?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ అధికారం ఇచ్చింది..అందుకే బీహార్‌లో కులగణన జరిగింది. వాటన్నిటినీ పరిశీలించి కులగణన చేయడానికి మేం నిర్ణయించుకున్నాం.దీంతో మీకు కూసాలు కదిలిపోతున్నాయి. మీ కుట్రలు బయటపడి పోతున్నాయి.మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మరనే మీరు ఇలా భయపడి పోతున్నారు. కులగణన ఒక చారిత్రక నిర్ణయం.రామ్మనోహర్ లోహియా లాంటి వారు దీని గురించి పోరాడారు. ఆయా వర్గాలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు వారి ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలుస్తోంది.