ఇది కదా ‘చిత్ర’మంటే!

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గారు సినీనటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్.టి.రామారావు, ఎం.జి. రామచంద్రన్ లు కలసి సాంప్రదాయ బద్ధంగా చాప పైన కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యం …

1972 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గావున్న పి.వి.నరసింహారావు గారు ఒక సారి మద్రాసు ను సందర్శించటం జరిగింది. ఆ సమయంలో మద్రాసులోనే ఉన్న ఎన్.టి.రామారావు గారు, ఆయనను భోజనానికి పిలిచారు. అప్పటికే తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎం.జి. రామచంద్రన్ గారిని కూడా ఆ విందుకు పిలిచారు.

ఆవిధంగా యన్టీఆర్ గారి ఇంట్లో పి.వి.నరసింహారావు, ఎమ్జీఆర్ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చేవారు. అందువల్లనే కింద కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఈ ముగ్గురు లో ఒకరు ప్రధాని మంత్రి కాగా ఇద్దరు ముఖ్యమంత్రులు
కావడం విశేషం!

– వెలగపూడి గోపాలకృష్ణ

Leave a Reply