Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని రైతుల మహాపాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్ధతు

– రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
– రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి రాజధాని తరలింపునకు నిరసనగా రాజధాని రైతులు చేపట్టిన తిరుపతి మహాపాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోంది. రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అండగా నిలవాలి. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనన్ఫూర్తిగా కోరుతున్నా. రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. ప్రభుత్వం మొండితనం వీడి ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు.
రాజధాని నిర్వీర్యంతో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లింది. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారు. 3.5లక్షల కోట్లు అప్పులు ప్రజల నెత్తిన వేశారు. చేసిన అప్పులు మాత్రం ప్రజల సంక్షేమానికి కాకుండా వైసీపీ నేతలు జేబుల్లోకి మళ్లించుకున్నారు. రాజధాని లేక రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు.
పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడుతుంటే బాధేస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని వుంటే వారి విమర్శలకు తావుండేది కాదు. జగన్ చేతకాని తనంతోనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏపీని తీసేసి మాట్లాడుతున్నారు. అభివృద్ధి వినాశనానికి జగన్ నాయకుడిగా వున్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షలా మార్చారు. రాష్ట్రం అదోగతిపాలవడానికి రాజధాని విధ్వంసమే కారణం. అన్ని విధాలా రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది చాలు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసింది చాలు. ఇప్పటికైనా తీరు మార్చుకుని రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తే బాగుంటుంది.

LEAVE A RESPONSE