– మహానాడులో టీడీపీ హెచ్ ఆర్ డీ ఛైర్మన్ రామాంజనేయులు
మహానాడు ప్రాంగణం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసింది. 3 లక్షలకు పైగా వీరసైన్యం తెలుగుదేశం శౌర్యాన్ని చాటేందుకు తరలివచ్చారు. ఎన్నికలు ఎప్పుడువచ్చినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడే.మన అధినేత నిన్న మహానాడులో 12 తీర్మానాలు చేశారు. వాటి గురించి కార్యకర్తలంతా విధిగా తెలుసుకోవాలి. మన నాయకుడిని సాక్షాత్తూ అసెంబ్లీలోనే దారుణంగా అవమానించారు. చంద్రబాబు శపథాన్నినెరవేర్చడానికి మనందరం ఉక్కు సంకల్పంతో పనిచేయాలి.ఆయన మన ముఖ్యమంత్రి అయ్యేవరకు అలుపెరగని పోరాటం చేయాలి. కార్యకర్తల రక్షకుడు, వారికి ఏఆపదవచ్చినా అండగా నిలిచే నాయకుడు నారా లోకేశ్. నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఎన్టీఆర్ వచ్చాకే పేదలు బియ్యం అన్నం తిన్నారు. అంతకుముందు జొన్నలు, నూక అన్నమే తినేవారు. border=”0″></a>