Suryaa.co.in

Andhra Pradesh

మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ

• కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
• జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ అధినేత కు ఘన స్వాగతం పలికిన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా నేతలు, కార్యకర్తలు
• భారీ వాహన శ్రేణితో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి జగ్గంపేట రోడ్ కు వెళ్లిన టీడీపీ అధినేత

స్వాగతం పలికిన మహిళలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
• మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ
• మహిళలకు ఆస్థిహక్కు, విద్యారంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ
• మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్
• డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన పార్టీ టీడీపీ
• నేడు మహిళలు పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదీ మహిళా శక్తి.
• వైసిపి ప్రభుత్వం పన్నులు బాదుడుతో ప్రజలను బాదేస్తుంది.
• రాష్ట్ర ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం
• చివరికి చెత్తపైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది.
• సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి మీ నుంచి రూ.50 కాజేస్తున్న ప్రభుత్వం గురించి మీరు తెలుసుకోవాలి.
• జగన్ ఎలా దోచేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలి
• జగన్ ఒక రంగుల పిచ్చోడు….ప్రతి దానికీ జగన్ తన పార్టీ రంగులు వేసుకుంటాడు. మనం మౌనంగా ఉంటే మీ మోహాలకు రంగులు వేస్తాడు.
• మీ భూములు సర్వే చేసి..జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నాడు
• జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్ లు వేస్తాడట. నువ్వే మా నమ్మకం కాదు..నువ్వే మా దరిద్రం అని ప్రజలు అంటున్నారు.
• వైసిపి పని అయిపోయింది…..ఇక గెలిచే అవకాశం లేదు.
• జగన్ ను ఇంటికి పంపుదాం….సైకో పోవాలి…సైకిల్ రావాలి

LEAVE A RESPONSE