ఘనంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు

ఈ నెల 17 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం BRS పార్టీ కార్యాలయంలో MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ పక్కనే ఉన్న థ్రిల్ సిటీ లో అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

భారీ కేక్ కటింగ్, కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇవే కాకుండా పలు ఆలయాలు, చర్చి లు, మసీదుల లో ప్రత్యేక యాగాలు, పూజలు, ప్రార్ధనలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్ లలో కేక్ కటింగ్, రక్తదాన శిభిరాలు, పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను MLA లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో మేయర్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో చండీయాగం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో గోత్రనామాలతో అర్చన, ఓల్డ్ సిటీ లోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయం లో లక్ష పుష్పార్చన, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు, ఆబిడ్స్ లోని వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు, నాంపల్లి లోని దర్గాలో, నల్లగుట్ట మసీదులో చాదర్ సమర్పణ, అమీర్ పేట గురుద్వార్ లో, గౌలిగూడ గురుద్వార్ లో హర్ధాస్ (ప్రత్యేక ప్రార్ధనలు) జరపడం జరుగుతుందని చెప్పారు.

Leave a Reply