Suryaa.co.in

Andhra Pradesh

చిత్తశుద్ధితో పని చేస్తున్న మాపై టీడీపీ దుష్ప్రచారం

-పోలవరాన్ని సందర్శించిన ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం
-మంత్రి అంబటి రాంబాబు

పశ్చిమ గోదావరి: చిత్తశుద్ధితో పని చేస్తున్న మాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును మంత్రులు ,ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో బృందం పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లింది. ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్,ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, ధనలక్ష్మీలు పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు.

టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న మాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో షోవర్క్‌ తప్ప మరేమీ లేదన్నారు. చంద్రబాబు తప్పిదాల వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. చంద్రబాబు వల్ల జరిగిన నష్టాలను మేం పూడ్చుతున్నామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద అత్యధికంగా ఖర్చు చేసింది మేమే అన్నారు.

ప్రాజెక్ట్‌ల గురించే కాదు.. అసలు నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీయంగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా..? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదు. ప్రాజెక్ట్ ల గురించే కాదు, నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదు. ఆయన పాలనలో వర్షాలు పడవు . పోలవరంలో 72శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధం.

ప్రతిపక్షాలు, వైయ‌స్ఆర్‌ సీపీకి వ్యతిరేకంగా వున్నవారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్వ నాశనం చేశారు. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం తెలివి తక్కువ తనం. అప్పట్లో దాని విలువ 4 వందలు కోట్లు.. హెడ్ వర్క్ విలువ 5,943 కోట్లు.. టీడీపీ హయాంలోనే 3,591 మాత్రమే ఖర్చు చేశారు.. కానీ, 7,422 కోట్ల అంచనాకి ప్రాజెక్టు వెళ్లిపోయింది. చంద్రబాబు అజ్ఞానం వల్ల ప్రాజెక్ట్ పనులు కుంటుపడ్డాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అత్యధికంగా ఖర్చు చేసింది వైయ‌స్ఆర్‌ సీపీ మాత్రమే.. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ పోలవరం.. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైయ‌స్ఆర్‌ సీపీ తీసుకుంది. పొరపాట్లకు తావులేకుండా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంభించబోయేది సీఎం వైయ‌స్‌ జగన్‌ మాత్రమే. పోలవరంపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ అంబ‌టి రాంబాబు సవాల్‌ విసిరారు.

LEAVE A RESPONSE