– ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుంది అంబటి రాంబాబు. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్ రెడ్డి మూడేళ్లపాటు ఏం పీకాడు? ఒక్క పిల్ల కాలువ కూడా కట్టని మీ అధినేత, నువ్వు నువ్వు పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది అంబటి. కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిది. నాన్న పోగానే సీఎంని చెయ్యమని సోనియా, రాహుల్ కాళ్ళ పై జగన్ కుటుంబం పడిన విషయం మరిచిపోయారా? ఎవడో పెట్టుకున్న పార్టీని కబ్జా చెయ్యడం నిజం కాదా?
కేసులు మాఫీ కోసం మోదీ కాళ్ళ పై పడిన ఘటన గుర్తులేదా? అమ్మని, చెల్లిని రాజకీయం కోసం వాడుకొని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్ పొలిటీషయన్ జగన్ రెడ్డే అంబటి. జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడిని నీకు త్వరలోనే అర్థమవుతుంది.