Suryaa.co.in

Andhra Pradesh

బాలకోటి రెడ్డి పై కాల్పుల ఘటనను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి:నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డి పై హత్యాయత్నాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కాల్పుల కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆసుపత్రి లో ఉన్న పార్టీ నాయకులు, వైద్యం అందిస్తున్న డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు.

ప్రస్తుతం బాటకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు చంద్రబాబు నాయుడు కు వివరించారు. మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు నాయుడు డాక్టర్లను కోరారు. కొద్ది నెలల క్రితం బాలకోటి రెడ్డిపై కత్తులతో దాడి జరిగిందని….ఇప్పుడు ఏకంగా గన్ తో కాల్పులు జరిపి హతమార్చే ప్రయత్నం చెయ్యడం దారుణం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE