-రాళ్లు విసిరితే భయపడి పారిపోతామనుకున్నారా?
– చీర కట్టుకునే మహిళలను కించపరిచేలా మాట్లాడిన రోజా క్షమాపణ చెప్పాలి
– మృతురాలి ఇద్దరి పిల్లలను చదివించేందుకు నేను హామీ ఇస్తున్నా
– తుమ్మపూడి లో టీడీపీ యువనేత లోకేష్ ఆగ్రహం
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైసీపీ కుక్కల దాడులకు టీడీపీ నేతలు భయపడే పరిస్థితి లేదు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా.. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తా. కొంతమంది పోలీసుల తీరు వల్ల ఆ శాఖకు చెడ్డపేరు వస్తుంది.
రాళ్లు విసిరితే భయపడి పారిపోతామనుకున్నారా? వైసీపీ నేతలకు చట్టాలపై గౌరవం, భయం
లేదు.మహిళలపై దాడులు జరిగితే బుల్లెట్ కన్నా స్పీడుగా వస్తానన్న జగన్ ఎక్కడా. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారు.
21 రోజుల్లో దిశా చట్టం కింద నిందితులపై చర్యలు తీసుకోవాలి. తిరుపతమ్మకు న్యాయం జరగకపోతే… ధర్నా చేస్తా. పోస్టుమార్టం నివేదిక రాకముందే అత్యాచారం జరగలేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఎలా చెప్తారు?
ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో కాల్ డేటా రికార్డులు బయటపెట్టాలి.ఎస్పీపై ఎవరి ఒత్తిడి ఉందో బయటపెట్టాలి. చీర కట్టుకునే మహిళలను కించపరిచేలా మాట్లాడిన రోజా క్షమాపణ చెప్పాలి. నాపై ఇప్పటికే 12 కేసులు పెట్టారు… ఇంకో 10 పెట్టుకోండి. నిందితులు ఏ పార్టీ వారైనా సరే శిక్ష పడాల్సిందే.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు కనిపించడం లేదా? వైసీపీ నాయకులను వదిలిపెట్టేది లేదు… గుర్తుపెట్టుకోండి. శాసనసభలో నా తల్లిని సన్నబియ్యం సన్నాసి అవమానించాడు. మహిళలను పోలీసులు లాఠీలతో కొట్టారు.రాజకీయం చేసేందుకు రాలేదు. కుటుంబానికి అండగా ఉండేందుకు వచ్చా. మృతురాలి ఇద్దరి పిల్లలను చదివించేందుకు నేను హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు.