నేను కాంగ్రెస్ సలహాదారుడిని అయితే..

కాంగ్రెస్ బలంగా లేని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లాగే సెక్యులర్ ముసుగు వేసుకున్న ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడి కాంగ్రెస్ అధ్యక్ష మండలి ఒకటి వేయిస్తా. అంటే రాష్ట్రాలలో బలంగా ఉండి, మేమూ ప్రధాని కావచ్చుగా అని ఆశపడి సంఖ్యా బలం లేక కొట్టుమిట్టాడుతుంటారు కదా అలాంటి వాళ్ళనీ.. కేంద్ర కాంగ్రెస్ అధ్యక్ష బోర్డ్ లోకి తీసుకుంటా. ఉదాహరణకి మమతా, జగన్, కేసీఆర్, స్టాలిన్, పవార్, అఖిలేష్ లాంటి వాళ్ళనీ ఈ పార్టీల ఎంపీ లని మొత్తం కాంగ్రెస్ ఛత్రం లోకి చేర్చి, దాదాపు 200 మంది ఎంపీ లతో బలమైన ప్రతిపక్షం చేసి , వాళ్ళకి రాహుల్ గాంధీ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ గా చేస్తా. సమస్యలు,విధానాలపై బలంగా గొంతెత్తి ప్రజలలో వెళ్ళే అవకాశం మెరుగు అవుతుంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు స్థానాలలో ఏ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్ష కేంద్ర బోర్డ్ లో ఉన్నారో.. వాళ్ళ పార్టీ అభ్యర్థులు అందరూ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయాలని ప్రతిపాదన చేస్తా.

బీజేపీ,కాంగ్రెస్ నేరుగా తలపడే రాష్ట్రాలు తప్ప , మిగిలిన చోట్ల ఆయా ప్రాంతీయ పార్టీల గుర్తు మీదే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసేలా రాజీ చేస్తా.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలలో ఈ సూత్రం ద్వారా పరస్పరంగా బలపడే విధంగా.. అదే విధంగా Balances and checks ఉండే విధానం వలన కాంగ్రెస్ కి ఉనికి బలపడుతుంది. ప్రాంతీయ పార్టీలు కేవలం వ్యక్తి,కుటుంబం అనే పరిధి దాటి, సుదీర్ఘంగా రాజకీయంగా నిలబడే అవకాశం ఉంటుంది.

నిధులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్రంట్ లాంటి విఫల ప్రయోగాలు కాకుండా, ప్రాంతీయ శక్తులు అన్ని ఒకే పార్టీ లో కలిసి కట్టుగా ఉండడం వలన, ప్రజలు కొంత విశ్వసించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే జాతీయ శక్తి కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం అని ముందు పెట్టి, ప్రజలని ఓప్పించచ్చు. మోదీ బీజేపీ కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడవచ్చు.
ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయ్..

– పెంజర్ల మహేందర్ రెడ్డి
( అఖిలభారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్
జాతీయ అధ్యక్షుడు)

Leave a Reply