– రాష్ట్రంలో ఓట్లదొంగలు. దొంగ ఓట్లనమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోనే 8వ వింత నమోదుచేశాడు
– 2019 నుంచి జరిగిన ప్రతిఎన్నికల్లో జగన్, అతని ప్రభుత్వం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని గెలిచింది తప్ప, ప్రజాబలంతోకాదు. : కింజరాపు అచ్చెన్నాయుడు
• టీడీపీ తమదృష్టికి తీసుకొచ్చిన అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్
• దొంగఓట్ల వ్యవహారంపై టీడీపీ న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాడి వైసీపీ ప్రభుత్వ ఆటకట్టిస్తుందన్న అచ్చెన్నాయుడు
• ఎన్నికల కమిషనర్ ని కలిసినవారిలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీశాసనసభ్యులు దివిశివరాం తదితరులు ఉన్నారు
“ రాష్ట్రంలో ఓట్లదొంగలు పడ్డారు, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్ని మేనిప్లేట్ చేయడం అలవాటుగామారింది. 2019తర్వాత జరిగినఎన్నికలన్నింటిలో (ఏ ఎన్నికైనా సరే) జగన్ వ్యవస్థల్ని మేనిప్లేట్ చేసి గెలిచాడుతప్ప, ప్రజాబలంతో కాదు. ఏ ఎన్నికసక్రమంగా జరగడంలేదని తాముగతంలోనే నెత్తీనోరు కొట్టుకు న్నాం. ప్రజలకుకూడా ఇదిఅర్థమైంది. 2100 ఇంటినంబర్లతో లక్షా85వేల దొంగ ఓట్లుచేర్పించారు. 14నియోజకవర్గాల్లో వైసీపీప్రభుత్వం ఇష్టానుసారం దొంగఓట్లు చేర్పించింది.
ఈ దొంగఓట్ల తంతుకి సంబంధించిన ఆధారాల్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ముందు ఉంచాము. దొంగఓట్ల నమోదులో వైసీపీప్రభుత్వం సాధించిన ఘనత, నిజంగా ప్రపంచంలో ఎనిమిదోవింతే. జగన్మో హన్ రెడ్డి, అతనిపార్టీనేతలు ఏస్థాయిలో అధికారుల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఒక్కోఇంటిలో 50 నుంచి 500వరకు దొంగఓట్లు చేర్పించారు. ఈ దొంగఓట్లపై విచారణజరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికలకమిషనర్ని కోరాం. తాముచెప్పిన అంశాల తో ఎన్నికలకమిషనర్ ఏకీభవించారు. మీరు చెప్పినఅంశాలు మాదృష్టికి కూడా వచ్చాయన్నారు.
జూలై 21వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ జాబితా పరిశీలన జరుగుతుందని, ఆ ప్రక్రియ అక్టోబర్ 7వరకు కొనసాగుతుందన్నారు. ఆ పరిశీ లనలో బీ.ఎల్.వో లు అందరూ ప్రతిఇంటికెళ్లి, ప్రతిఓటర్ ని వెరిఫై చేసి, అసలు ప్రతిఇంటిలో ఉన్న ఓటర్లుఎంతమంది.. ఉండాల్సినవారు ఎక్కడికైనా వెళ్లారా.. వలసవెళ్తే ఎంతమంది వెళ్లారనే వివరాలు సేకరిస్తారని ఎన్నికల కమిషనర్ చెప్పారు. కానీ చాలాచోట్ల బీ.ఎల్.వో లు ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడో ఒకచోటకూర్చొని ఓటర్లజాబితాలోని ఓటర్లవివరాలపై టిక్కులు పెడుతున్నారని ఆయనతో చెప్పాం.
దానివల్ల దొంగఓట్లు తొలగించడం సాధ్యంకాదని చెప్పాం. కాబట్టి ఇప్పుడున్న సాంకేతికపరిజ్ఞానంతో గూగుల్ లోని హౌస్ మ్యాపింగ్ సాయంతో బీ.ఎల్.వోలు గ్రామానికి వెళ్లాక, ఇంటింటికీ తిరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చని చెప్పాం. మేంసూచించిన విధంగా సాంకేతికపరిజ్ఞానం సాయం తో దొంగఓట్లను కట్టడిచేయడంపై తప్పకుండా ఆలోచిస్తామని ఎన్నికల కమిషన ర్ చెప్పారు.
అక్టోబర్ 17నాటికి ఓటర్లజాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బయటకు వస్తుందని, దాన్ని మీఅందరికీ ఇస్తామని, అదిచూశాక, మీరుచెప్పిన విధంగా ఇంకాదొంగఓట్లు ఉంటే, ఆధారాలతోసహా మరోసారి ఫిర్యాదుచేయమని, అప్పుడు తప్పుచేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు.
ముఖ్యమంత్రికి, అధికారపార్టీ నేతలకు భయపడి దొంగఓట్లు నమోదు చేసే అధికారుల్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వాచ్ డాగ్స్ లా పసిగట్టి, ప్రజల ముందు నిలబెడతారు
రాష్ట్రంలోని అధికారయంత్రాంగం ముఖ్యమంత్రి, వైసీపీనేతల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగి ఓటర్లజాబితాలో అవకతవకలకు పాల్పడితే, టీడీపీనేతలు వాచ్ డాగ్స్ లా వెతికి తప్పుచేసినవారిని పట్టుకొని, వారిని ఎన్నికలసంఘం ముందు నిలబెడ తారని హెచ్చరిస్తున్నాం. గ్రామస్థాయి టీడీపీనేతలందరూ దొంగఓట్లపై నిఘాపెట్టి, అవి పుట్టడానికి కారణమైన వారివివరాలు సేకరించి టీడీపీఅధిష్టానానికి అందిస్తారు. కలెక్టర్ల తీరుపై కూడా రాష్ట్రఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదుచేశాం. తప్పుచేసిన కలెక్టర్లపై చర్యలుతీసుకుంటామన్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్ని కలో విపరీతంగా దొంగఓట్లు పోలయ్యాయి. మొన్నజరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికారపార్టీ అదేపంథా నమ్ముకుంది. ఈ విషయాల్ని కూడా ఎన్నికలకమిషనర్ ముందు ఉంచాము.
దొంగఓట్ల వ్యవహారంపై టీడీపీ న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాడుతుంది
అసలు ఇప్పటివరకు ఎన్నిదొంగఓట్లు నమోదయ్యాయి..ఏ గెజిటెడ్ అధికారి సంతకంతో వాటిని చేర్చారు… ఎవరిప్రలోభంతో సదరుఅధికారి దొంగఓట్లనమోదు కు సహకరించాడనే వివరాలుకూడా సేకరించాము. వీటన్నింటినీ హైకోర్టు ముం దుఉంచి త్వరలోనే కేసువేయబోతున్నాం. అటున్యాయపరంగా, ఇటుక్షేత్రస్థా యిలో దొంగఓట్లను తొలగించేవరకు టీడీపీ పోరాడుతుంది. బీ.ఎల్.వోలు క్షేత్రస్థా యిలో ఓటర్ వెరిఫికేషన్ కు వెళ్లినప్పుడు, మేంకూడా వారితోపాటు వెళ్తాం. తొలగించిన ఓట్లు, దొంగఓట్లపై నిగ్గుతేలుస్తాం.
విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని ఒకనియోజకవర్గంలో నమోదైన దొంగఓట్ల కు ముగ్గురుబీ.ఎల్.వోలను బాధ్యుల్నిచేసి వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయం కూడా ఎన్నికలకమిషనర్ దృష్టికి తీసుకెళ్లాము. ఏ పార్టీ బీ.ఎల్.వో లు ఏ ఇంటికెళ్లినా, వారితోపాటు మీరుకూడా వెళ్లండి..వారుతప్పుచేస్తే మాదృష్టికి తీసుకురండి అని ఎన్నికల కమిషనర్ చెప్పారు.