Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల సమస్యలపై కనీసం వినతిపత్రం కూడా తీసుకోరా?

– గిరిజనులంటే జగన్ రెడ్డికి ఎందుకంత చిన్నచూపు
– టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం. దారు నాయక్

గిరిజన ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక కనీసం వారి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర మండిపడ్డారు.

గిరిజన గురుకులాలను సాధారణ స్కూళ్లుగా మార్చవద్దంటూ వినతిపత్రం ఇచ్చేందుకు తాడేపల్లిలోని గిరిజన గురుకులం కార్యదర్శి కార్యాలయానికి వెళ్లిన ఎస్టీ నాయకులతో సహా దాదాపు 150 మంది గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గిరిజన సమస్యలపై కనీసం వినతిపత్రం కూడా తీసుకోలేదంటే గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమౌతుందన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం. దారునాయక్ మాట్లాడుతూ… గిరిజనులంటే జగన్ రెడ్డి మొదటి నుంచి చులకన భావంతో చూస్తున్నారు. 81 గిరిజన గురుకులాలను సాధారణ పాఠశాలలుగా మారుస్తుంటే గిరిజనులు మాట్లాడకూడదా? గిరిజన బిడ్డల భవిష్యత్ కోసం ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టు చేస్తారా ? గిరిజనులు విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడేయాలని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. వారికి నాణ్యమైన విద్య అందకుండా గురుకులాలను సాధారణ పాఠశాలలుగా మార్చే హక్కు జగన్ రెడ్డికి ఎవరిచ్చారన్నారు.

LEAVE A RESPONSE