-జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై సమాధానం చెప్పలేకే ప్రభుత్వం టీడీపీ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేసింది
-మనుషుల చావులను కూడా రాజకీయంచేయడమనే సంప్రదాయాన్ని ప్రభుత్వం మొదలుపెట్టడం దురదృష్టకరం
-సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన టీడీపీశాసనసభ్యులు
అణచివేత అధికమైతే ప్రజలనుంచి తిరుగుబాటు తప్పదని గుర్తుంచుకోండి : పయ్యావుల కేశవ్ (టీడీపీ శాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్)
ప్రభుత్వనిర్వాకం, నిర్లక్ష్యంతో సంభవిస్తున్న చావులను కూడా ఈప్రభుత్వం తనరాజకీయాల కు వాడుకోవాలని చూడటం దురదృష్టకరం. బాధ్యతగలప్రతిపక్షంగా తాము నాటుసారా మరణాలపై అసెంబ్లీలో చర్చజరగాలని పట్టుబడితే, మంత్రి ప్రకటనచేస్తాడు..ప్రశ్నలు అడగ టానికి వీల్లేదంటారా? అసెంబ్లీ నిర్వహిస్తున్నది ప్రభుత్వం, మంత్రులు చెప్పేది వినడానికా? సభలో మేంఎవరినీ తిట్టలేదు..కొట్టలేదు. నాటుసారా తాగి చనిపోయినవారి మరణాలపై చర్చించాలనే కోరాము. ప్రజల ప్రాణాలు పోయినా కూడా శాసనసభ చర్చించదంటే ఇక దేనిపై చర్చిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి.
సస్పెన్షన్లు, బెదిరింపులతో టీడీపీసభ్యుల గొంతునొక్కలే రని గుర్తుంచుకోండి. ఎమర్జెన్సీ రోజుల్లో ఇంతకంటే భయంకరమైన అణచివేతను నాటిప్రభు త్వాలు వాడుకున్నాయి. ఎలాంటి మీడియా, ఇతర ప్రసార మాధ్యమాలప్రభావం పెద్దగాలేని ఆరోజుల్లోనే ఇక్కడినుంచి ఢిల్లీ వరకు ఉన్నప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తేమంచిది. అణచివేత అధికమైతే ప్రజలనుంచి తిరుగుబాటు తీవ్రమవుతుందని గుర్తుంచుకోండి. ఈ అణచివేత ధోరణిని సమాజంలోనూ, సభలోనూ ప్రభుత్వం కొనసాగిస్తే, మద్యం నాటుసారా మరణాలపై తెలుగుదేశంపార్టీ సుదీర్ఘమైన పోరాటాన్నే ఎంచుకుంటుంది తప్ప,ప్రభుత్వ దుర్మార్గాలకు తలొగ్గదని స్పష్టంచేస్తున్నాం.
నాటుసారా మరణాలపై అసెంబ్లీలో చర్చజరిగితే తానుచేస్తున్న సారావ్యాపారం బయటపడుతుందని జగన్మోహన్ రెడ్డి భయం : నిమ్మల రామానాయుడు (టీడీపీ శాసనసభ్యులు)
గతనాలుగురోజుల్లో 25మంది జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగిచనిపోతే, ఈ ప్రభుత్వం దానిపై 25సెకన్లుకూడా సభలో మాట్లాడటానికి తమకు అవకాశమివ్వలేదు. ప్రజాస్వామ్యా న్ని ఖూనీచేసేలా స్పీకర్ చర్చను పక్కదారి పట్టిస్తూ టీడీపీసభ్యుల గొంతునొక్కుతూ అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దురదృష్టకరం. నాటుసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరిగితే తాను, తనపార్టీవారు రాష్ట్రవ్యాప్తంగాచేస్తున్న సారా, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారాల గుట్టు బయటపడుతుందనే ముఖ్యమంత్రి నాటుసారామరణాలపై చర్చజరక్కుండా అడ్డుకు న్నాడు. సంవత్సరానికి రూ.4వేలకోట్లవరకు తనకు అందుతున్న మద్యంముడుపుల వ్యవహారం బయటకు పొక్కుతుందన్న భయంకూడా ముఖ్యమంత్రిలో ఉంది. తాను సాగిస్తున్న మద్యంవ్యాపారంలో భాగంగానే, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పిచ్చి బ్రాండ్లను, కల్తీబ్రాండ్లను జగన్ రెడ్డి రాష్ట్రంలో అమ్మిస్తున్నాడు. ఆ వ్యవహారం బయట పడుతుందనే అసెంబ్లీలో చర్చజరగకూడదని మమ్మల్సి సస్పెండ్ చేయించాడు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పిన జగన్ రెడ్డి, ఈ మూడేళ్లలో మద్యంఅమ్మకాలు, దుకాణాలు, ఆదాయం అన్నీపెంచుకున్నాడు.. ఇప్పటికీ పెంచుకుంటూపోతున్నాడు. ఏటా మద్యంపై రూ.16,500కోట్లవరకు ఆదాయాన్ని ప్రజలజీవితాలునాశనం చేస్తూ వసూలు చేస్తున్నాడు. తాగండి..తూలండి.. జేబులుగుల్ల చేసుకోండి అనే నినాదంతో ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యం వ్యాపారం వర్థిల్లుతోంది.
తాము జంగారెడ్డిగూడెం వెళ్లి బాధితులతో, మృతులకుటుంబాలతో మాట్లాడాము. వారిసమస్యలను, వారు మాతో పంచుకున్న వేదనను ప్రజలకు అర్థమయ్యేలా సభసాక్షిగా చెప్పాలనుకుంటే తమను ప్రభుత్వం అడ్డుకుంది. సభలో మంత్రిచెప్పినదానికి, బాధితులు తమతో చెప్పినదానికి ఎక్కడా పొంతనలేదు. కోవిడ్ తర్వాత తలెత్తిన దుష్ఫలితాలతో జంగారెడ్డిగూడెంలో చనిపోయారని మంత్రి చెప్పడం విడ్డూరం. అలానే ఆహారం కలుషితమై చనిపోతే కేవలం కుటుంబాల్లోని మగవారే ఎలాచనిపోతారని మంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఇంట్లో ఆహారాన్ని అందరూ తింటారనే ఇంగితంకూడా మంత్రికి లేకపోవడం సిగ్గుచేటు. మృతులు తాలూకా శరీరంలోని శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపించి పరీక్షలు చేయించకుండానే మంత్రి , నాటుసారా బాధితుల మరణాలను తక్కువచేసి మాట్లాడటం సిగ్గుచేటు. మద్యాన్ని తయారుచేసేది.. దాన్ని పంపిణీచేసేది .. అమ్మేది అంతా జగన్మోహన్ రెడ్డే.
మద్యపాననిషేధం అనిచెప్పిన వ్యక్తే మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25వేలకోట్లవరకు అప్పులు తెచ్చాడు. 15సంవత్సరాల పాటు మహిళలమాంగల్యాలను తన అప్పులకోసం తాకట్టుపెట్టిన వ్యక్తి, నేడు అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. తానుసాగిస్తున్న మద్యంవ్యాపారంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగుతున్నవైనం రాష్ట్రవాసులకు తెలియకూడదనే ముఖ్యమంత్రి సభలో నాటుసారా మరణాలపై చర్చజరగనివ్వలేదు. మద్యంపై వచ్చే ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలు సాగిస్తానని గతసమావేశాల్లో ముఖ్యమంత్రే చెప్పాడు. భర్తతాగితే భార్యకు చేయూత ఇవ్వడం, తండ్రి తాగితే పిల్లవాడికి అమ్మఒడి ఇవ్వడం.. ఇదే జగన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమం. తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రతిపక్షసభ్యుల గొంతు నొక్కాడు. జంగారెడ్డిగూడెంలో నాటుసారావల్ల చనిపోయినవారంతా ఎస్సీలు, ఎస్టీలు, పూటగడవనివారే. జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో అసెంబ్లీలో మా గొంతునొక్కొచ్చు కానీ, ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా దోషిగా నిలబడకతప్పదు.