Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఒరవడి చూస్తే వారి తండ్రిది కూడా సహజ మరణమే అని చెప్పేట్లు ఉన్నారు

– టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
దమ్ము, ధైర్యం లేక ప్రభుత్వం బాధ్యతలనుంచి పారిపోయింది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి 26 మంది చనిపోతే ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు. సహజ మరణాలు అని ప్రకటించడం అన్యాయం. సహజ మరణాలైతే 26 మంది మగవాళ్లే చనిపోతారా? మంత్రి గుడ్డిగా ఆధారాలు తెస్తే సీఎం ఇవన్నీ సహజ మరణాలని ప్రకటించేశారు.

ఒకే ప్రాంతంలో ఇంతమంది చనిపోతే దాన్ని సహజ మరణాలనరు. వీరంతా మధ్యతరగతివారే. తమ భర్తలు కల్తీ సారా తాగి చనిపోయారని మృతుల భార్యలే చెబుతున్నారు. 26 మంది అడ్రస్ లు, ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చి మరణాల మీద చర్చ జరగాలని నిన్న నోటీసు ఇస్తే చర్చ ప్రారంభించడానికి ఈ ప్రభుత్వానికి దడపుట్టింది. వాస్తవాలు బయటికొస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

వాళ్ల బాబాయి మరణం సహజ మరణమని తొలుత ఎలా బుకాయించారో అలాగే వీటిని కూడా సహజ మరణంగా మార్చేలా కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి ఒరవడి చూస్తే వారి తండ్రిది కూడా సహజ మరణమే అని చెప్పేట్లు ఉన్నారు. దౌర్భాగ్యపు మద్యం రేట్లు పెంచడంతో పొద్దస్తమానం సారాయికి అలవాటుపడ్డ సామాన్యులు తాగడానికి డబ్బుల్లేక చౌకగా దొరికే నాటుసారా తాగి మృత్యువాత పడ్డారు.

వాస్తవాలను కప్పిపుచ్చారు. సాధారణంగా ఒక ప్రాంతంలో ఇంత రేషియోలో జననాలు జరిగితే ఈ రేషియోలో మరణాలు సంభవిస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి వింత పోకడల్ని ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఈ దుస్థితి ఈ ముఖ్యమంత్రివద్దే ఉంది. చర్చలు చేపడితే చెబుతామని చెప్పాం. ముఖ్యమంత్రి ప్రకటన వెలువరించాక మంత్రి ప్రకటన వెలువరిస్తారట. అది మేం వినాలట.

మేం వాస్తవాలు తెలుపుతామన్నా వినలేదు. మీతో సమాధానం చెప్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా మా అధ్యక్షుడు ప్రకటించారు. దిక్కుమాలిన, కనీస బాధ్యత లేని ప్రభుత్వంకు బడుగు, బలహీనవర్గాల ప్రజలు చనిపోతే కనీస కనికరం లేదు. సహజ మరణాలని సరిపెట్టుకుంది. ప్రతిపక్షంగా ఆవేదన చెందుతున్నాం.

ఇలాంటి దుర్మార్గ వైఖరి అవలంబిస్తోంది.ఇలాంటి ప్రభుత్వం దొరకడం ప్రజలు చేసుకున్న పాపంగా కనబడుతోంది. 26 మంది చనిపోయిన ఇష్యూ శీరికి సహజంగా ఉంది. శాసన మండలి నుంచి వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యలపై అహర్నిశలు పోరాడుతాం.

శాసనసభని, శాసన మండలిని వేదికగా చేసుకొని పోరాడుతాం. శాసనసభలో నిన్న ఐదుగురిని, ఇవాళ మొత్తాన్ని సస్పెండ్ చేసి ఏం సాధించారు. శాసనమండలిలో చర్చించే అవకాశం కల్పించడంలేదు. ఇంతకంటే దుర్మార్గమేముంటుంది. మేం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు.

జగన్ వాయిస్, ఫేస్, పదాల్లో ఎక్కడా మానవత్వం లేదు
– టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
నిన్న ఇచ్చిన తీర్మానంలో 26 మంది చనిపోయారు, దానిమీద చర్చ జరగాలని నోటీసిచ్చాం. నిన్న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి, నేడు కూడా మా ప్రశ్నకు సమాధానంగా ఇవన్నీ సహజ మరణాలు, మేం ఎంక్వైరీ చేశామన్నారు. ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ ను ఒప్పుకన్నప్పటికి ప్రభుత్వం ప్రకటన వెలువరించే ముందు ఏదో ఒక ఆధారం ఉండాలి.

సహజ మరణాలు కాదని అనటానికి మీ దగ్గర ఏ ఆధారాలున్నాయని మంత్రి అడుగుతున్నారు. చనిపోయిన వారు అనారోగ్యులు కాదు, అందరూ 33 నుంచి 45 ఏళ్లవాళ్లు కూడా ఉన్నారని మేం స్పష్టంగా చెప్పాం. వీరంతా ఆరోగ్యంగా ఉన్నవాళ్లే. ప్రభుత్వం తెప్పించుకున్న రిపోర్టు సరికాదు. నిన్న పాడిన పాటే ఈరోజు పాడుతున్నారు. చనిపోవడానికి కారణాలేంటని మేం సపరేటు వాయిదా నోటీసు ఇచ్చాం.

మేం ప్రకటన చేస్తాం అప్పుడు చర్చించమనడం సరికాదు. ప్రభుత్వ వైఖరి ఏం బాగలేదు. స్టేట్ మెంట్ ఇచ్చాక చర్చలుండవంటారు. స్టేట్ మెంట్ చదివేసి మా బాధ్యత అయిపోయిందంటున్నారు. దీన్ని మేం ఒప్పుకోం. సీరియస్ గా ఎంత దూరానికైనా తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చదివేటప్పుడు వాయిస్ లో, ఫేస్ లో, పదాల్లో ఎక్కడా మానవత్వం లేదు. ఎల్ జి దుర్ఘటన లో సహజంగా చనిపోయినట్లు ఎందుకు అనలేదు? హుటాహుటిన ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లి వారికి కోటి రూపాయలు ఇచ్చారు.

ఒకే ఊరిలో సారా తాగినవారు మాత్రమే చనిపోయారు. తాగనివారు బాగా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పెద్ద ఊరు, ఆ ఊరిలో సారా ఎలా కాస్తారని సీఎం అడిగారు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అడిగాము. ఇల్లీగల్ కేసులున్నాయా అని అడిగితే ఉన్నాయని తెలిపారు. సారా కాయడానికి ప్రమాణం జనాభాగా తీసుకోవాల్సిన అవసరంలేదు. ఏబీ బేవరేజెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే సారా కాచేవారిని ఎందుకు అనుమతిస్తాం అని అడుగడం అర్థరహితం.

లిక్కర్ షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇసుక, మట్టి, సారా అమ్ముకుంటారు. అక్కడ వైసీపీ నాయకులే సారా అమ్మారు. సొంతంగా వారే సారా బట్టీలు పెట్టారు. వారు కలిపిన కెమికల్స్ లలో రియాక్షన్ వచ్చి చనిపోయారు. దానిపై ఒక టెక్నికల్ ఎంక్వైరీ వేయమని మేం అడుగుతున్నాం. బ్లడ్ శాంపిల్స్ లేదా లివర్ శాంపిల్స్ టెస్ట్ చేయాలి. కోవిడ్ ద్వారా చనిపోయారు కాబట్టి కోవిడ్ మరణాలంటున్నాం. లిక్కర్ తాగేకనే చనిపోయారు. తాగక ముందు ఎవరూ చనిపోలేదు.

33 ఏళ్ల యువకుడు చనిపోయాడంలే ఆలోచించాలి. ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని దాటవేస్తోంది. ఏ రిపోర్టుతో మీరు సహజ మరణాలంటున్నారో ఆ రిపోర్టును తీసుకొని రమ్మంటున్నాం. మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ పూర్తిగా నిరసిస్తూ ఆందోళన కంటిన్యూ చేస్తుంది. పార్టీ ప్రణాళికలో నిర్ణయిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ ను ఖండిస్తున్నాం.

LEAVE A RESPONSE