అవనిగడ్డ: అవనిగడ్డ మండలం, దక్షిణ చిరువోలు లంక ఎస్సీ కాలనీలో ఆదివారం వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎన్నారైలు సహాయం చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గ్రామంలోని 466 కుటుంబాలకు ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రెండు దుప్పట్లు, ఒక చీర, ఒక లుంగీ చొప్పున పంపిణీ చేశారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, చల్లపల్లి వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, టీడీపీ, జనసేన నాయకుడు బండే రాఘవ, నిడమానూరి దిలీప్, ముమ్మనేని రాజకుమార్(నాని), కోనేరు బలరాం, గుడివాక శివరావు, యలవర్తి చిన్నా, యలవర్తి ఆది, సర్పంచ్ సనకా సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ బొప్పన భాను, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.