తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించి కింది తీర్మానాలు చేయడమైంది. ఈ పొలిట్ బ్యూరో తీర్మానాలను కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశంలో విడుదల చేయడం జరిగింది.
ఈ సమావేశంలో కె.అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షులు బక్కని నర్సింహులు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పితాని సత్యనారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, ఎండీ ఫరూఖ్, అరవింద కుమార్ గౌడ్, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, గురజాల మాల్యాద్రి, అశోక్ బాబు, మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.
1. వరదల్లో మృతి చెందిన వారందరి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు సంతాపం తెలపడమైంది.
2. వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి. తుఫాన్ ముందస్తు చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వరద మరణాలకు ఇసుక మాఫియా చర్యలు కూడా కారణంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులను ఉదారంగా బాధితులకు ఇవ్వాలి. వరికి హెక్టారుకు రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, అరటికి రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయంగా రూ.లక్ష అందించి.. శాశ్వత గృహాన్ని ఉచితంగా నిర్మించి ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు తక్షణమే రూ.25 వేలు అందించాలని, ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేలు ఇవ్వాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
3. “ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని కోసం” అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్రకు పొలిట్ బ్యూరో సంఘీభావం ప్రకటించింది. ఆఫీసులు మూడు ముక్కలు చేయడం వికేంద్రీకరణ కాదు- రెండున్నరేళ్లలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నిజమైన వికేంద్రీకరణ జరిగింది తెలుగుదేశం పాలనలోనే- జగన్ రెడ్డి పాలనలో అంతా అతి కేంద్రీకరణ జరుగుతున్నది- అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
4. బీసీ జనగణన చేయాలి- బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం ఈ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలి
5. మోటారు వెహికల్ చట్టం ద్వారా పన్నులు పెంచడం వల్ల వాహనరంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మందిపై భారం పడుతుంది. మోటారు వెహికల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది
6. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. నిత్యావసర ధరలు పెరిగాయి. కావున పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 తగ్గించాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
7. పంచాయతీల నిధులు దారిమళ్లింపు 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరించడమే అవుతుంది. కనుక వెంటనే పంచాయతీలకు నిధులు జమ చేయాలి- నరేగా పనుల మంజూరు గ్రామ సభలకే ఉంటుంది.
8. మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ భారీగా ఎన్నికల అక్రమాలకు ఒడిగట్టింది. అయినా తెలుగుదేశానికి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయి. చైతన్యం ప్రదర్శించిన ఓటర్లను, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తలు, నాయకుల్ని పొలిట్ బ్యూరో అభినందించింది.
9. ఆడపడచుల ఆత్మగౌరవం కోసం డిసెంబర్ 1 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలి- ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను ఏవిధంగా కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై దాడిచేశారో ప్రజాచైతన్యం కల్పించాలి.
10. గ్రామ కమిటీలు, బిఎల్ఏల నియామకాలు పూర్తి చేయాలి. డిసెంబర్ చివరి వరకూ ఓటర్ల చేర్పింపు, ఫేక్ ఓట్లు తొలగింపుపై కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునివ్వడమైంది
11. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు ముద్దాయిలను రక్షించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నవని పొలిటి బ్యూరో అభిప్రాయపడింది
12. సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం విద్యుత్ వినియోగదారులపై పెనుభారాలు పడేవిధంగా ఉన్నది
13. 1983 నుంచి ఉన్న గృహాలకు డబ్బులు చెల్లించమని ప్రభుత్వం సామాన్యుల్ని ఒత్తిడి చేయడాన్ని ఖండించింది. ఇందుకోసం చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం గృహాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని తీర్మానించింది
14. వరి వేయరాదన్న మంత్రుల ప్రకటనను ఖండించడమైంది. వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి
15. కౌన్సిల్ రద్దు, పునరుద్దరణపై వైసీపీ విధానం వ్యవస్థల పట్ల ఎలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేస్తున్నది
16. రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్ సీరియస్ కామెంట్స్ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడమైంది
17. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరిగింది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు. ప్రజలు చైతన్యవంతులై వ్యవస్థల్ని, పౌర హక్కులను కాపాడుకోవాలి. తెలుగుదేశం ఈ కర్తవ్య నిర్వహణలో ముందు ఉంటుంది.