Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక ర్యాంపులను రక్షించుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి ప్రజలను ముంచేశాడు

-వరి సాగువద్దంటున్న మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు, అన్నదాతలను వ్యవసాయానికి దూరంచేసేలా ఉన్నాయి
• గిట్టుబాటు ధరలేక , పంటలసాగుకు ప్రభుత్వంనుంచి సరైన మద్ధతులేక ఇప్పటికే అన్నదాతలు ఈసురోమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. అన్నదాతల వేదన, రోదన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పట్టడంలేదు
• వరిసాగుకి ప్రత్యామ్నాయం చూపకుండా వరిపైరు వేయొద్దని ప్రభుత్వం చెప్పడాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోంది
• వరదల్లో సర్వస్వం కోల్పోయినవారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
• చనిపోయిన వారికుటుంబాలకు రూ.25లక్షలచొప్పున పరిహారమివ్వాలి
-టీడీపీ రాష్ట్రఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
వైసీపీనేతలు, ముఖ్యమంత్రి, తమసంపాదనకోసం ఇసుకదోపిడీకోసం నిర్దాక్షిణ్యంగా ప్రజలను వరదల్లో ముంచేసిందని, దానితోపాటు దక్షిణభారతదేశపు ధాన్యాగారంగా పేరుపొందిన రాష్ట్రంలో వరిసాగుచేయొద్దని చెబుతున్న మంత్రులవ్యాఖ్యలు రాష్ట్రరైతాంగాన్ని అవమానించేలా ఉన్నాయని టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
రాష్ట్రంలోని రైతులను వ్యవసాయానికిదూరంచేసి, వారికడుపుకొట్టడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రైతులు రబీకి సిద్ధమవతున్న తరుణంలో వ్యవసాయ మంత్రి వరిసాగు చేయొద్దని చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏపంట వేయాలో చెప్పలేనిమంత్రి, వరిసాగుచేయొద్దని రైతులకు ఉచితసలహాలివ్వడం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం, వ్యవసాయమంత్రి కన్నబాబు రైతులను, వ్యవసాయంపై ఆధారపడి జీవించే లక్షలమంది కుటుంబాలను రోడ్డునపడేయడమే తమధ్యేయమన్నట్లుగా మాట్లాడుతు న్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న వారికి ఏవిధమైన ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతు న్నారో చెప్పకుండా వరివేయొద్దని చెబితే సరిపోతుందా? వరిఆధారితపరిశ్రమలు, వాటికి సంబంధించిన రంగాలపై ఆధారపడిబతికేవారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఈ ప్రభుత్వం పిచ్చిప్రకటనలు ఎలాచేస్తుంది? అసలేరాష్ట్రంలో ధాన్యాన్ని కొనే దిక్కులేకుండా పోయారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యంకొనుగోళ్లు జరగడంలేదు. వ్యాపారులను కొనకుండా చే స్తున్నప్రభుత్వం, రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోళ్లకు సవాలక్ష కొర్రీలు వేస్తోంది. రైతుభరోసా కేంద్రాల్లో ఏస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయో అందరంచూస్తూనే ఉన్నాం. అధికారులు, ప్రభుత్వంచెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పూర్తిగా వ్యవసాయాన్ని నీరుగార్చేచర్యలనే అవలంభిస్తున్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాలిడే (పంటవిరామం) ప్రకటించారు.. ఇప్పుడు మరలా జగన్ జమానాలో అలాంటిపరిస్థితులే రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రభుత్వం, వ్యవసాయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది రైతులు ఇప్పటికే కాడికిందపపడేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకాలతో ఇప్పటికే రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలోఉంది. కౌలురైతు ఆత్మహత్యల్లో కూడా దేశంలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ వాస్తవాలను తాముచెప్పడంలేదు..ఎన్సీఆర్బీ నివేదిక లే చెబుతున్నాయి. గిట్టుబాటు ధరలేక, పంటల సాగుకు ప్రభుత్వంనుంచి సరైన మద్ధతులేక ఇప్పటికే అన్నదాతలు ఈసురోమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. అన్నదాతల వేదన, రోదన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పట్టడంలేదు.
ఒకసర్వేనంబర్లో పంటపూర్తిగా నష్టపోయామని రైతులు లబోదిబోమంటుంటే ఈ ప్రభుత్వం ఆ సర్వేనంబర్లోని పంటతాలూకా ధాన్యాన్ని సీఎమ్ఆర్ ద్వారా కొనుగోలుచేయలేమని చెప్పడం సిగ్గుచేటు. వర్షాలకుతడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలుచేయాలి. కొనడంతోపాటు సకాలంలో అన్నదాతలకు సొమ్ముఅందించాలని డిమాండ్ చేస్తున్నాం. కోస్తాప్రాంతంతోపాటు, రాయలసీమలో కాలువలనీరు అందని ప్రాంతాలలో బోర్లకింద వరిసాగు చేస్తారు. ఆ విధంగా బోర్లకింద సాగయ్యే 3.75లక్షలఎకరాల వరిసాగుచేపట్టవద్దని ప్రభుత్వంచెప్పేసింది. ఈ పరిస్థితితో రైతులు దిక్కుతోచని స్థితిలోఉన్నారు. గోదావరి డెల్టాకు రెండోపంటలకు నీరిస్తారోలేదో తెలియడం లేదు. గోదావరిడెల్టాలో రెండోపంట సాగుపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టతలేదు. నీరుఇస్తారో ఇవ్వరో ఎటూతేల్చడం లేదు.. దానికితోడు ఐఏబీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించ లేదు.
టీడీపీప్రభుత్వంలో ఏటా అక్టోబర్ నెలాఖరులోనే ఐఏబీ సమావేశం నిర్వహించి, ముందుగానే రైతులను సాగుకిసన్నద్ధం చేయ డం జరిగేది. కానీ ఈప్రభుత్వం ముందస్తు ఆలోచనలేకుండా వ్యవహరిస్తోంది. ఈక్రాప్, ఈ కేవైసీ నమోదులో ప్రభుత్వవ్యవహరించిన తీరుతో చాలాప్రాంతాలలో అన్నదాతలు తమ ఉత్పత్తులు అమ్ముకోలేని దుస్థితిలోఉన్నారు. రబీధాన్యం కొనుగోళ్ల తాలూకా సొమ్ముని కూడా ఈప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. రైతులవద్దఉన్న ధాన్యంకొంటారో లేదో కూడా తెలియడంలేదు. బయటమార్కెట్లో బియ్యం కేజీ రూ.50వరకు ఉన్నాకూడా ఈ ప్రభుత్వం వరిసాగుచేయొద్దని చెబుతోంది. తమరాష్ట్రంలోధాన్యం కొనగోళ్లు చేపట్టాలంటూ పొరుగురాష్ట్రం ఉద్యమిస్తుంటే, ఏపీప్రభుత్వంలో మాత్రం చలనంలేదు. ఏపీనుంచి ధాన్యాన్ని తెలంగాణకు తీసుకెళుతుంటే, అక్కడిప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇంతజరుగుతున్నా జగన్మో హన్ రెడ్డి, తనకు అత్యంతసన్నిహితుడైన కేసీఆర్ తో మాట్లాడి, రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు?
ఇసుక ర్యాంపులకోసం వైసీపీనేతలు ప్రజలను వరదల్లో ముంచేశారు
వరదలు, వర్షాలకు రాయలసీమప్రాంతంలో జరిగిన నష్టం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందే. తుఫానుహెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను అప్రమత్తంచేయడంలో, ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఘోరంగా విఫలమైంది. వైసీపీనేతలు వారి ఇసుకవ్యాపారం కోసం, ఇసుకర్యాంపులను కాపాడుకోవడానికి మానవత్వంలేకుండా ప్రవర్తించి, ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. నెల్లూరులో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుంటే, ఇసుకతవ్వకాలకోసం కట్టలను చదును చేశారు. దాని పర్యవసానమే దామరమడుగు, కొవ్వూరు ప్రాంతాల్లో జరిగిన తీవ్ర ఆస్తినష్టం, ప్రాణనష్టం. అలానే కడపజిల్లాలో అన్నమయ్యప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వ్యవహరించింది. సొంతజిల్లాలోని ప్రజలను కాపాడలేని దౌర్భాగ్యస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు.
అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా డ్యామ్ లకు మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ నిపుణులు ఎప్పుటినుంచో చెబుతున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదు. పింఛా డ్యామ్ కు ఏడాదిక్రితమే మరమ్మతు చేయాలని సాగునీటిరంగ నిపుణులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం ఇసుక తవ్వకాలకోసమే జగన్ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛాడ్యామ్ లను గాలికివదిలేసి, ప్రజలను, ఆస్తిని, ఇతరత్రా మూగజీవాలను బలి తీసుకుంది. ప్రాజెక్ట్ ల గేట్లుతెగి, ఉధృతమైన నీటిప్రవాహాం గ్రామాలను ముంచెత్తడానికి దూసుకొస్తున్నాకూడా ప్రభుత్వయంత్రాంగం దిగువగ్రామాలప్రజలను అప్రమత్తంచేయలేదు. అన్నమయ్యప్రాజెక్ట్ 5 గేట్లు ఒకసారి ఎత్తిఉంటే, అక్కడ అంతప్రమాదం జరిగిఉండేదికాదని నిపుణులుచెబుతున్నారు. కేవలం ఇసుకవ్యాపారంకోసమే వైసీపీప్రభుత్వం ప్రజలను, పంటల్ని, వారిఆస్తుపాస్తుల్ని నీళ్లపాలుచేసింది. ఇంతవరకు ఈ ప్రభుత్వం గల్లంతైనవారి ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయింది.
కళ్లముందు ఇంతదారుణం జరిగితే వైసీపీఎమ్మెల్యే రోజా ఏదేదో మాట్లాడుతున్నారు. చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాల్లో తిరిగివెళ్లిపోయారని అంటున్నారు. ఆమెకు వాస్తవాలు తెలియవా..లేక వాటిని పట్టించుకోవడం మానేశారా అన్నది తమ సందే హం. హుద్ హుద్, తిత్లీ, లైలా తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తినప్పుడు చంద్రబాబునాయుడు గారు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించి, ప్రాణ నష్టం, ఆస్తినష్టంలేకుండాచేశారు. తుఫాను ప్రభావితప్రాంతాల్లో బస్సులోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షించారు గానీ, ఈ ముఖ్యమంత్ర్రిలా ఇంట్లోకూర్చొని ఉపన్యాసాలు ఇవ్వలేదు. తిత్లీ ధాటికి శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైతే, యుద్ధప్రాతిపదికన తిరిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ఘనత చంద్రబాబుగారిది. ఇవేవీ రోజాకు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నాం.
అదేవిధంగా రైతులకు జరిగిన పంటనష్టం తాలూకా పరిహారంచెల్లింపులో కూడా చంద్రబాబునాయుడు గారే ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక 2020ఖరీఫ్ లో ఏడుతుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తా యి. దానివల్ల దాదాపు 40లక్షలఎకరాల్లో, దాదాపుగా రూ.17వేలకోట్ల విలువైన పంటనష్టం జరిగితే, ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు కేవలం రూ.1070కోట్లు మాత్రమే చెల్లించాడు. చంద్రబాబునాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2016-17లో రూ.1820కోట్ల నష్టపరి హారం రైతులకు అందించారు. టీడీపీప్రభుత్వంలో ఐదేళ్లకాలానికి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింది రూ.3,759కోట్లను చెల్లించారు. ఈ విధంగా కళ్లముందు వాస్తవాలు కనిపిస్తుంటే రోజా పిచ్చిపట్టినట్లు మాట్లాడితే ఎలా?
జగన్మోహన్ రెడ్డి తనచర్యలతో వ్యవసాయరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నాడు. వరద ప్రభా వితప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్లులేనివారికి ఇళ్లునిర్మించాలని, ఆస్తినష్టం జరిగినవారికి తగినవిధంగా సాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వరదలవల్ల చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి రూ.25లక్షలపరిహారంఇవ్వాలి. వరిసాగుచేపట్టవద్దన్న ప్రభుత్వం తనఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. రంగుమారిన, తడిచినపచ్చి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలుచేసి, వెంటనే చెల్లింపులుచేయాలని కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE