ప్రధాని నరేంద్ర మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

ఏపీలోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోండి.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 5 జిల్లాల్లో దాదాపు 2 లక్షలకుపైగా హెక్టార్లలో పంట నష్టం జరిగింది.రెండు డ్యాంలు, చెరువులు, కాల్వలకు గండి పడి తీవ్ర నష్టం వాటిల్లింది.60 మంది మృతి చెందగా, పలువురు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలి.మీరు గానీ, కేంద్ర మంత్రులుగాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు గుర్తించండి.తక్షణమే ఏపీకి కేంద్రం నుండి వరద సహాయక నిధులు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం.

Leave a Reply