-విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలు వెన్ను విరుస్తున్న ప్రభుత్వం
-జనానికి కవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేసిన టీడీపీ నేతలు
-విసనర కర్రలు, లాంతర్లతో వినూత్న నిరసన
-మూడేళ్లలో ఏడుసార్లు పెంచారని ఆగ్రహం
-ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమన్న నేతలు
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచుతూ ఇవే దిక్కు అన్న రీతిలో ఆందోళనకు దిగింది. పలుచోట్ల లాంతర్లు, విసనర కర్రలతో వినూత్నంగా నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పండుగనాడు రాష్ట్రప్రజల జీవితాల్లో చీకట్లు నింపిన ఏకైక సీఎం జగన్ అని విమర్శించారు. ఉగాది రోజున శుభవార్త వింటామనుకున్న ప్రజలకు ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల పెంపును కానుకగా ఇచ్చారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజున ప్రజలకు ఇచ్చిన మాటను తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. రూ.42,872 కోట్ల భారాలను ప్రజల నెత్తిన పెట్టారని, విద్యుత్ రంగాన్ని మూడేళ్లలో నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజల ఆదాయాన్ని పన్నులు, అదనపు బాదుడుతో లాక్కుంటున్నారని విమర్శించారు. ఇష్టారీతిన ప్రజలకు షాక్ ఇస్తున్న ప్రభుత్వానికి త్వరలో ప్రజలు షాక్ ఇస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో…
• ఆముదాలవలసలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆద్వర్యంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినూత్నంగా ర్యాలీ చేపట్టారు. లాంతర్ ను ఎత్తి చూపుతూ, తాటాకుతో చేసిన విసనర కర్రలతో ఆందోళన చేపట్టారు.
• టెక్కలిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదోశాల మేరకు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు స్థానికులకు పంచుతూ నిరసన తెలిపారు.
• శ్రీకాకుళం నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టారు.
• పాతపట్నంలో ఇంచార్జ్ కలమట వెంకట రమణ పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలతో కలిసి క్యాండీల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానికులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచి ఇవే దిక్కు అంటూ ప్రచారం చేశారు.
• పలాసలో ఇంఛార్జ్ గౌతు శిరీష్ ఆదేశాల మేరకు కార్యకర్తలు, నేతలు జనానినిక కొవ్వొత్తులు పంచి నిరసన తెలిపారు.
• నరసన్నపేటలో ఇంఛార్జ్ బొగ్గు రమణమూర్తి విసరన కర్రలు, లాంతర్లతో ఆందోళన చేపట్టారు.
విజయనగరం జిల్లాలో…
• పార్వతీపురంలో ఇంఛార్జ్ బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ లాంతర్లు పట్టకుని విద్యుత్ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు.
• గజపతినగరంలో ఇంఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ఆద్వర్యంలో కాగడాలు, విసనర కర్రలతో ప్రదర్శన చేపట్టారు.
• శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి ఆద్వర్యంలో లాంతర్లు, విసనర కర్రలు పట్టుకుని ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం ఎదుటు ఆందోళన చేపట్టారు.
• కురుపాం నియోజకవర్గంలో ఇంఛార్జ్ తోయక జగదీశ్వరి ఆదేశాలతో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఏఈకి వినతిపత్రం అందించారు.
విశాఖపట్నం జిల్లాలో…
• వెలగపూడి రామకృష్ణ, గండి బాబ్జీ, పల్లా శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి భరత్, బీమిలి ఇంఛార్జ్ కొరాడ రాజబాబు, తదితర నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు, విసనర కర్రలు పట్టుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• యలమంచిలిలో ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో…
• రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో డీలక్స్ సెంటర్లో ధర్నా చేపట్టి ఏఈ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
• రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో షాపులున్న వారికి కవ్వత్తులు, విసనర కర్రలు అందించారు.
• రాజానగరంలో ఇంఛార్జ్ పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
• అనపర్తిలో నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
• పెద్దాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఆదేశాలతో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఆందోళన చేపట్టారు.
• తణుకులో ఇంఛార్జ్ అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ర్యాలీ చేశారు. ల్యాంతర్లు పట్టుకుని, కవ్వొత్తుల, విసనరకర్రలు పట్టకుని ఆందోళన చేశారు.
• తునిలో యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
• కాకినాడలో ఇంఛార్జ్ వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ఆందోళన చేశారు.
• అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు, ముమ్మడివరంలో దాల్లు సుబ్బరావు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో…
• బీమడోలులో ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
• బీమవరంలో ఇంఛార్జ్ తోట సీతారామలక్ష్మీ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు.
• నర్సాపురంలో పొత్తూరి రామరాజు ఆద్వర్యంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని నిరసన తెలిపారు.
• ఆచంటలో పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఆదేశాలతో స్థానిక నాయకులు ఆందోళన చేశారు.
• ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆందోళన చేశారు.
• తాడేపల్లిగూడెంలో ఇంఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
కృష్ణా జిల్లాలో….
• విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు వినూత్నంగా వచ్చి, వెళ్లే బస్సుల్లోని ప్రయాణికుల వద్ద విద్యుత్ బిల్లులు చెల్లించడానికి బిక్షాటన చేశారు.
• విజయవాడ సెంట్రలో నియోజకవర్గంలోని ధర్నాచౌక్ లో పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు నేతలతో కలిసి ఆందోళనకు దిగారు.
• నూజివీడు నియోజకవర్గంలో ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పాల్గొని ఏప్రిల్ నెలలో ప్రజలను జగన్ ఫూల్స్ చేశారని విమర్శించారు.
• విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని ఆదేశాల మేరకు డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.
• మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విసనర కర్రలు, లాంతర్లు పట్టుకని కార్యకర్తలతో భారీ ఆందోళన నిర్వహించారు.
• నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య సబ్ స్టేషన్ వద్ద, గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విసనర కర్రలు, కొవ్వొత్తులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.
గుంటూరు జిల్లాలో…
• గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఇంచార్జ్ అహ్మద్ నజీర్ ఆధ్వర్యంలో లాంతర్లు పట్టుకుని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
• తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో పట్టణంలో సబ్ స్టేషన్ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
• పొన్నూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర ఆదేశానుసారం పార్టీ నేతలు పార్టీ కార్యాలయం నుండి ఐలాండ్ సెంటర్ వరుకు ర్యాలీ చేపట్టారు.
• వినుకొండలో నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆదేశాలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
• చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో, పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆదేశాతో కార్యకర్తలు, నాయకులు కొవ్వొత్తులు, నిరసన కర్రలతో వినూత్నంగా ఆందోలన చేపట్టారు.
• గురజాల నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలు ఆందోలన చేశారు.
ప్రకాశం జిల్లాలో…
• దర్శి నియోజకవర్గంలో ఇంఛార్జ్ పమిడి రమేష్ ఆదేశాలతో నేతలు, కార్యకర్తలు లాంతర్లతో ర్యాలీ చేశారు. అనంతరం స్థానికులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు.
• కనిగిరిలో ఇంఛార్జ్ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో…
• ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, ఫ్యానులతో నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వీధి నాటకం ప్రదర్శించారు. ఎండలు సైతం లెక్కచేయకుండా ప్రజలు తిలకించారు.
• కోవూరులో ఇంఛార్జ్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు ఆందోళన చేశారు.
• కావలిలో ఇంఛార్జ్ సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కవ్వత్తులు, అగ్గిపెట్టెలను జనాని కిపంచారు.
• గూడురులో ఇంఛార్జ్ పాశం సునీల్, సూళ్లూరుపేటలో సుబ్రహ్మణ్యం ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
• వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామక్రిష్ణ ఆదేశాల మేరకు నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
కర్నూలు జిల్లాలో…
• నందికొట్కూరులో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కవ్వొత్తులు పంచి, లాంతర్లతో ఆందోళన చేశారు.
• పాణ్యంలో ఇంఛార్జ్ గౌరు చరితా రెడ్డి ఆందోళనలో పాల్గొని విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేశారు.
• వెలుగోడులో శ్రీశైలం ఇంఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిరసన తెలిపిన అనంతరం ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు.
• నంద్యాలలో ఇంఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యలు ఫరూక్ ఆధ్వర్యంలో కవ్వత్తులు, అగ్గిపెట్టెలు పంచి ఆందోళన చేశారు.
• కోడుమూరులో ఇంఛార్జ్ ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
• డోన్ లో ఇంఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు.
కడప జిల్లాలో…
• కడప పట్టణంలో ఇంఛార్జ్ అమీర్ బాబు డబ్బు కొట్టుకుంటూ వెళ్లి కొవ్వొత్తులు అందించారు.
• కమలాపురంలో ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జాతీయ రహదారిపై బైఠాయించిన అనంతరం సబ్ స్టేషన్ ఎదుట నిరనస తెలిపారు.
• జమ్మలమడుగులో ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేశారు.
• పొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను పన్నులతో జగన్ పీల్చుకుతింటున్నారని ఆరోపించారు.
• రాయచోటిలో ఇంచార్జ్ రమేష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు.
• రాజంపేటలో ఇంఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు కార్యకర్తలతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన తెలిపి, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలను ప్రజలకు పంపిణీ చేశారు.
• కోడూరులో ఇంఛార్జ్ విశ్వనాథ నాయుడు పాల్గొని విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన అనంతరం కొవ్వొత్తుల పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లాలో…
• కుప్పం నియోజకవర్గం వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. విసనర కర్రలు, కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.
• తిరుపతిలో ఇంఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నాలుగుకాళ్ల మండపం వద్ద లాంతర్లు, విసనర కర్రలతో నిరసన తెలిపారు. మెడలో బల్బుల దండులను వేసుకుని ధర్నా చేపట్టారు.
• పలమనేరు నియోజకవర్గం వ్యాప్తంగా మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు.
• పీలేరులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఆందోళన చేపట్టారు.
• చంద్రగిరిలో ఇంఛార్జ్ పులవర్తి నాని ఆదేశాలతో నేతలు, కార్యకర్తలు రోడ్డపై బైఠాయించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ నేతలు నిరసనలు తెలిపారు.
• సత్యవేడులో జెడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అనంతపురం జిల్లాలో…
• హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు కొవ్వొత్తులు పంచి, విసనర కర్రలతో నిరసన తెలిపారు.
• కదిరిలో ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో లాంతర్లతో ఆందోళన చేపట్టారు.
• పుట్టపర్తిలో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.
• అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలు విద్యుత్ బిల్లులు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.