– వీడియో విడుదల చేసిన లోకేశ్
ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజల్ని సీఎం జగన్.. ఏప్రిల్ ఫూల్ చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ దుయ్యబట్టారు. వైకాపా ప్రొడక్షన్స్ సమర్పించు ఓ అత్యద్భుతమైన సినిమా ‘ఏప్రిల్ 1 విడుదల’ అంటూ.. ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
జనం చెవిలో జగన్ పూలు పెట్టారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్యనిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్నబియ్యం పంపిణీ హామీలు ఏప్రిల్ ఫూల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజధాని అమరావతి, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు హామీలు విస్మరించిన తీరును ఎండగడుతూ.. నాలుగున్నర నిమిషాల వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.