Suryaa.co.in

Andhra Pradesh

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని జిల్లావ్యాప్తంగా టిడిపి నిరసనలు..

ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్ ఎక్కాయి పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో టిడిపి పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టింది.
పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన జరిగింది.తుళ్లూరు మండలం రాయపూడి పెట్రోల్ బంకు వద్ద తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ చేపట్టిన నిరసనలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జరిగింది. గుంటూరు1,2 లలో టీడీపీ ఇంచార్జ్ లు నజీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. నరసరావుపేట ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో వినుకొండ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సత్తెనపల్లిలో టిడిపి నేత మన్నే మళ్ళీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టారు.

LEAVE A RESPONSE